తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయాలతో ఒకటి.. పరాజయాలతో మరోకటి

ఐదో విజయం కోసం ఎదురుచూస్తోంది ముంబయి ఇండియన్స్. ఈ మ్యాచ్​లో గెలిస్తే వరసగా నాలుగో విజయం అవుతుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్​ల్లో ఓడిపోయింది రాజస్థాన్​ రాయల్స్. ఈ మ్యాచ్​లోనూ పరాజయం చెందితే రహానే సేనకు ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టం కానున్నాయి.

ముంబయి

By

Published : Apr 13, 2019, 8:01 AM IST

ఐపీఎల్- 2019లో వరుసగా మూడు మ్యాచ్​ల్లో నెగ్గి నాలుగో విజయంపై కన్నేసింది ముంబయి ఇండియన్స్. మరోపక్క చివరి వరకు వచ్చి మ్యాచ్​ చేజార్జుకుంటున్న రాజస్థాన్​... గెలుపు కోసం ఆరాటపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ముంబయిగా వేదికగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

గత మ్యాచ్​లో గాయంతో రోహిత్ దూరమైనప్పటికీ ముంబయి అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్​ ఇన్నింగ్స్​తో పొలార్డ్ రెచ్చిపోయి జట్టును గెలిపించాడు. ఇదే ఆత్మవిశ్వాసంతో మరోసారి సత్తా చాటాలనుకుంటోంది ముంబయి జట్టు. పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ విజయం కోసం తహతహలాడుతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో చివరి వరకు వచ్చి అనవసర తప్పిదాలతో మ్యాచ్​ చేజార్చుకుంది.

ముంబయి ఇండియన్స్​...

పొలార్డ్, అల్జారీ జోసెఫ్ ఇద్దరూ ముంబయి జట్టుకు ప్రధాన బలంగా మారారు. ముంబయి నెగ్గిన గత రెండు మ్యాచ్​ల్లోనూ పొలార్డ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సన్​రైజర్స్​తో మ్యాచ్​లో 12 పరుగులిచ్చి ఆరు వికెట్లతో ఐపీఎల్​లో ఎవరూ అందుకోలేని ఘనత సాధించాడు అల్జారీ జోసెఫ్. వీరిద్దరూ జట్టులో కీలకం కానున్నారు. పొలార్డ్​తో పాటు డికాక్, సూర్యకుమార్ యాదవ్, పాండ్య సోదరులతో బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. ఈ మ్యాచ్​లో రోహిత్ కూడా ఆడే అవకాశముంది. బుమ్రా, అల్జారీ జోసెఫ్, బెహ్రెండార్ఫ్ లాంటి డెత్ ఓవర్ స్పెషలిస్టులో జట్టులో ఉన్నారు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్​లో సమతూకంగా ఉంది ముంబయి జట్టు. సొంతగడ్డపై జరగనుండటం వల్ల గెలుపుపై ధీమాగా ఉంది ముంబయి. ఈ మ్యాచ్​లో గెలిస్తే 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది రోహిత్ సేన.

రాజస్థాన్ రాయల్స్...

సమిష్టిగా ఆడటంలో విఫలమవుతోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. చెన్నైతో జరిగిన మ్యాచ్​ని సులభంగా గెలిచే అవకాశమున్నా చేజార్చుకుంది. బ్యాట్స్​మెన్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. రహానే, సంజూ సాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్ లాంటి హేమాహేమీలున్నా స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకులేకపోతున్నారు. బౌలింగ్​లో ఉనద్కత్, ధవల్ కులకర్ణి, శ్రేయాస్ గోపాల్ లాంటి దేశవాళీ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. రాజస్థాన్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇప్పటీ వరకు జరిగిన మ్యాచ్​ల్లో రాణించాడు.

ఇప్పటికే ఐదు మ్యాచ్​ల్లో పరాజయం చెందింది రహానే సేన. ఇందులో నెగ్గి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆశిస్తోంది రాజస్థాన్.

జట్ల అంచనా:

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ, పొలార్డ్, బెహ్రాండార్ఫ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అల్జారీ జోసెఫ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్

రాజస్థాన్ రాయల్స్:

అజింక్యా రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బట్లర్, సంజూ శాంసన్, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి.

ABOUT THE AUTHOR

...view details