తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ-ఏబీ జంట... ఐపీఎల్​లో రికార్డుల పంట​ - ఐపీఎల్​ 12వ సీజన్​

వరుస ఓటములకు చెక్​ పెడుతూ శనివారం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన  మ్యాచ్​లో బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్ బోణీ కొట్టింది.  కోహ్లీ (67; 53 బంతుల్లో 8×4), డివిలియర్స్‌ (59 నాటౌట్‌; 38 బంతుల్లో 5×4, 2×6) జట్టుకు విజయాన్నందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

కోహ్లి -ఏబీ జంట...ఐపీఎల్​లో మరో రికార్డు పంట​

By

Published : Apr 14, 2019, 8:15 AM IST

ఐపీఎల్‌-12లో పంజాబ్​పై బెంగళూరు స్టార్​ బ్యాట్స్​మెన్ కోహ్లీ- డివిలియర్స్​ అద్భుత ఇన్నింగ్స్​ ఆడారు. వీరిద్దరి ఆటకు 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఇందులో 85 పరుగులుకోహ్లీ-ఏబీ జోడీవే.

అదిరిన జోడీ​...

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ఏబీ-కోహ్లీ రికార్డు సృష్టించారు. 2789 పరుగులు సాధించి ఇప్పటివరకు 2787 పరుగులతో కోహ్లీ- క్రిస్​గేల్ రికార్డును వెనక్కి నెట్టారు. మూడో స్థానంలో 2357 పరుగులతో వార్నర్​-శిఖర్​ ధావన్​ జోడీ, 1906 పరుగులతో గంభీర్​-ఉతప్ప నాలుగు స్థానంలో ఉన్నారు. శనివారం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించారు.

  1. ఐపీఎల్​ 12వ సీజన్​లో తొలి విజయాన్ని నమోదు చేసింది బెంగళూరు. ఏడో మ్యాచ్​లోనూ ఓడిపోతే ఇప్పటివరకు 6 ఓటములతో దిల్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించేది కోహ్లీ సేన.
  2. ఐపీఎల్​లో మూడు సార్లు ఫైనల్​ చేరినా ఒక్కసారి టైటిల్​ గెలవలేకపోయింది రాయల్​ ఛాలెంజర్స్​.

ABOUT THE AUTHOR

...view details