తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2019, 2:38 PM IST

ETV Bharat / sports

ఆ ఒక్కటీ గెలిస్తే బాగుండేది: కోహ్లీ

వరుస పరాజయాలు వెక్కిరించినా జట్టు మొత్తం ఆత్మ స్థైర్యం కోల్పోకుండా ఆటను ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు ఆర్సీబీ సారథి కోహ్లీ.

ఆ ఒక్కటీ గెలిస్తే బాగుండేది: కోహ్లీ

హ్యాట్రిక్​ విజయాలతో మళ్లీ ప్లేఆఫ్స్​పై ఆశలు పెట్టుకుంటోంది బెంగళూరు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో బుధవారం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ను 17 పరుగుల తేడాతో ఓడించింది ఆర్సీబీ జట్టు.

"తొలి ఆరు మ్యాచ్​ల్లో ఓడిపోవడం జట్టును బాధించింది. కానీ ఆటగాళ్లు ఒత్తిడిలో కుంగిపోలేదు. ఫలితమేదైనా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. జట్టుగా ఆడితే మంచి ఫలితాలు వస్తాయన్నదే మా నమ్మకం. చివరగా ఆడిన ఐదు ఆటల్లో నాలుగు విజయం సాధించాం. ఆ ఒక్కటీ గెలిస్తే మాకు మరింత మెరుగైన అవకాశం ఉండేది"
-- కోహ్లీ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సారథి

175 పరుగుల లక్ష్యం పంజాబ్ ముందుంచితే చాలు అనుకున్న సమయంలో... స్టొయినీస్‌, డివిలియర్స్‌ చెలరేగి 200 పరుగులు అందించారు. వారు అద్భుత ఆటగాళ్లు అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఈ మ్యాచ్​ గెలవడం వల్ల సీజన్​లో తొలిసారి పాయింట్ల పట్టికలో అడుగు ముందుకు వేసింది బెంగళూరు. రాజస్థాన్​ను వెనక్కి నెట్టి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ బరిలో నిలవాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్​ల్లో తప్పకుండా గెలవాలి. తదుపరి మ్యాచ్​లో ఏప్రిల్ ​28న​ దిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్​షా కోట్లా మైదానంలో తలపడనుంది కోహ్లీ సేన.

ABOUT THE AUTHOR

...view details