ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్మెన్లు బౌండరీలే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 232 పరుగుల భారీ పరుగులు సాధించి ఈ సీజన్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది నైట్‌రైడర్స్ జట్టు.
ఆరంభం అదుర్స్...
ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రిస్‌లిన్, శుభ్‌మన్ గిల్ ముంబయి బలమైన బౌలింగ్ లైనప్‌ను చిత్తుచిత్తు చేశారు. క్రిస్‌లిన్(54; 28 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు), శుభ్‌మన్‌గిల్ (76; 45 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు) అర్ధ శతకాలతో రాణించారు. ఇదే క్రమంలో ఐపీఎల్లో పదో అర్ధశతకాన్ని సాధించాడు లిన్.