రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో గెలిచింది. రసెల్ మరోసారి విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను బెంగళూరుకు దూరం చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20వ ఓవర్లలో 205 పరుగులు చేసింది. కోల్‌కతా 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ గెలుపుతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రసెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
రసెల్ విజృంభన
ఓ దశలో 17 ఓవర్లకు 153 పరుగులతో ఐదు వికెట్లు కోల్పోయింది కోల్‌కతా. అలాంటి పరిస్థితిలో రసెల్ 13 బంతుల్లో 48 పరుగులతో విజృభించాడు. ఏడు సిక్సర్లతో ఊచకోత కోశాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో నోబాల్‌ను సిక్సర్‌గా మలిచాడు. తర్వాత ఫ్రీ హిట్‌ను కూడా సిక్సర్ కొట్టి ఒక్క బంతికే 13 పరుగులు పిండుకున్నాడు రసెల్. ఓ దశలో కోల్‌కతా ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ రసెల్ మెరుపు బ్యాటింగ్ వల్ల ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.