మే 8న ఎలిమినేటర్, 10న క్వాలిఫయర్–2 ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు నేటి నుంచే లభ్యం కానున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ప్లేఆఫ్ టికెట్లు - విశాఖ ఐపీఎల్ టికెట్లు
ఐపీఎల్ 12వ సీజన్ తుది అంకానికి చేరువైంది. మరో నాలుగు రోజుల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్లు నేటి నుంచే అందుబాటులో ఉంచనున్నారు.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ప్లేఆఫ్ టికెట్లు
బీసీసీఐ నిర్ణయించిన ప్రకారం.. రూ.500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3,500, రూ.5,000, రూ.7,500, రూ.9,000 ధరల్లో లభ్యం కానున్నాయి. టికెట్లను www.eventsnow.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు.