తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం​ - ఐపీఎల్​ తాజా

మరికొద్ది నెలల్లో రాబోయే ఇండియన్ ప్రీమియర్​ లీగ్​( ఐపీఎల్​) కోసం క్రీడాకారుల వేలంపాట డిసెంబర్​ 19న జరగనుంది. కోల్​కతా వేదికగా ఈ వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్​ పాలకమండలి సమావేశం నిర్ణయించింది.

ఐపీఎల్​ క్రీడాకారుల వేలం ఎప్పుడో తెలుసా?

By

Published : Nov 6, 2019, 5:11 AM IST

ఈ ఏడాది జరగబోయే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) కోసం క్రీడాకారుల వేలం డిసెంబరు 19న కోల్​కతాలో జరగనుంది. ఈ తేదీ, వేదికను మంగళవారం జరిగిన ఐపీఎల్​ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ లీగ్​.. సాధారణంగా ఏటా ఏప్రిల్​-మే నెలల్లో జరుగుతుంది. ఈ వేలం కోల్​కతాలో మొదటిసారిగా జరుగుతోంది.

బెంగళూరు నుంచి కోల్​కతాకు

ఏటా సంప్రదాయంగా బెంగళూరులో జరిగే ఈ వేలం.. ఈసారి కోల్​కతాలో నిర్వహించనున్నట్లు పాలక మండలి తెలిపింది. ఐపీఎల్​ 2019 కోసం ఒక్కో ఫ్రాంచైజీలకు రూ.82కోట్లు కేటాయించగా.. 2020నాటికి ఒక్కో జట్టుకు రూ.85 కోట్లు కేటాయించారు.

గత వేలంలో ఫ్రాంచేజీలకు మిగిని పోయిన సొమ్ముతో పాటు ఈ మూడు కోట్లు అదనంగా అందివ్వాలని నిర్ణయించారు. ఈ రకంగా చూస్తే దిల్లీ క్యాపిటల్స్​ 8.2 కోట్ల రూపాయల బ్యాలెన్స్​తో మొదటి స్థానంలో ఉంది. రూ.7.15 కోట్లతో రాజస్థాన్​ రాయల్స్​ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక కోల్​కతా 6.05 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

వేలానికి ముందు ఫ్రాంచైజీలకు మిగిలి ఉన్న నిధులు

చెన్నై సూపర్​ కింగ్స్​-రూ.3.2కోట్లు, దిల్లీ క్యాపిటల్స్-రూ.7.7 కోట్లు, కింగ్స్ XI పంజాబ్​-రూ.3.7 కోట్లు, కోల్​కతా నైట్​ రైడర్స్​-రూ. 6.05 కోట్లు, ముంబయి ఇండియన్స్​-రూ.3.5 కోట్లు, రాజస్థాన్​ రాయల్స్​-రూ. 7.15 కోట్లు, రాయల్ చాలెంజర్స్​ బెంగళూరు-రూ.1.80 కోట్లు, సన్​రైజర్స్​ హైదరాబాదు-రూ.5.30 కోట్లు.

ఇది కూడా చడవండి: భాగ్యనగరంలో ఐపీఎల్ ట్రోఫీ సందడి

ABOUT THE AUTHOR

...view details