తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచంలో కార్బన్​ పాజిటివ్​ క్రికెట్​ జట్టేది.? - పచ్చ జెర్సీ

ఐపీఎల్​...ఈ మెగా క్రికెట్​ సంగ్రామాన్ని యువత అమితంగా ఇష్టపడతారు. అందుకే విభిన్న పోటీలు, ప్రచారాలు నిర్వహిస్తుంటాయి ప్రాంఛైజీలు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచులో ఆరుపచ్చ జెర్సీని ధరించారు రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు ఆటగాళ్లు. 2011 నుంచి చేస్తోన్న ఈ కార్యక్రమం ద్వారా సేవ్​ మదర్​ ఎర్త్​ అంటూ సందేశం ఇస్తున్నారు.

ప్రపంచంలోనే తొలి కార్బన్​ పాజిటివ్​ క్రికెట్​ జట్టు ఏది ..??

By

Published : Apr 8, 2019, 6:30 AM IST

చెత్తను రీసైకిల్​ చేసి వ్యర్థాలను తగ్గించేందుకు సహాకరించండి... అంటూ ప్రజలకు పిలుపునిస్తోంది రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్టు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో వస్తోన్న చెత్తను సేకరించి పునరుత్పాదన​ చేస్తున్నాయి ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్​ కార్పొరేషన్లు. వీటికోసం పచ్చ, నీలం రంగుల డబ్బాలను వినియోగిస్తున్నాయి. వీటి గురించి మరింత అవగాహన కల్పిస్తోంది ఆర్సీబీ. క్లీన్​స్వీప్ హ్యాష్​టాగ్​​ పేరిట ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

క్లీన్​స్వీప్​ ఛాలెంజ్​
  • 2011 నుంచి ప్రారంభం...

ప్రతీ సీజన్​లో ఓ మ్యాచులోగ్రీన్​ జెర్సీని ఆర్సీబీ జట్టు 2011 నుంచే ధరిస్తూ.. గో గ్రీన్​ పేరిట పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. పచ్చదనంతో గ్లోబల్​ వార్మింగ్​ను ఎదుర్కోవచ్చని సూచిస్తోంది. దీనిలో భాగంగా మొక్కలు నాటడం సహా ప్రభుత్వ రవాణా ఉపయోగించి ఇంధన వాడకాన్ని తగ్గించాలని ఆర్సీబీ యాజమాన్యం కోరుతోంది.

చెత్తను రీసైక్లింగ్​ చేయడంపై అవగాహన

ప్రతి ఏటా టాస్​ వేసే సమయంలో కెప్టెన్​ కోహ్లి చిన్న మొక్కను ప్రత్యర్థి జట్టు సారథికి అందిస్తాడు. దీంతో పాటు గ్రీన్​ జెర్సీలపై పేర్లు లేకుండా ట్విట్టర్​ ఐడీలతో బరిలోకి దిగుతుంది ఆర్సీబీ జట్టు.

  1. 2016లో బెంగళూరు ఆటగాళ్లు సైకిళ్ల మీద స్టేడియానికి వచ్చారు. అభిమానులకు సీఎన్​జీ రిక్షాలను ఏర్పాటు చేసి 'గో గ్రీన్'​ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ.
  2. 2011లో స్కూలు విద్యార్థులు చెట్లను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించారు.
  3. 2013లో ఆర్సీబీ జట్టు ప్రపంచంలోనే తొలి కార్బన్​ పాజిటివ్​ క్రికెట్​ టీమ్​గా ఘనత సాధించింది.
  4. ఆర్సీబీ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియం... ప్రపంచంలోనే సోలార్​తో నడుస్తోన్న తొలి క్రికెట్​ స్టేడియం.
  5. స్వచ్ఛ భారత్​ కార్యక్రమానికి మద్దతిస్తూ ప్రచారాలు నిర్వహిస్తోంది బెంగళూరు జట్టు.

ABOUT THE AUTHOR

...view details