తెలంగాణ

telangana

ETV Bharat / sports

బట్లర్ వర్సెస్ గేల్.. కరన్ వర్సెస్ ఆర్చర్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్

మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు గెలుపుకోసం చెమటోడుస్తున్నాయి.

బట్లర్ వర్సెస్ గేల్.. కరన్ వర్సెస్ ఆర్చర్

By

Published : Apr 16, 2019, 7:00 AM IST

అస్థిరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది పంజాబ్. ఆడిన 7 మ్యాచ్​ల్లో రెండు గెలిచి ఏడో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.

ఇరుజట్లు తలపడిన మొదటి మ్యాచ్​లోనే మన్కడింగ్ వివాదం చెలరేగింది. రాజస్థాన్ జట్టు ఈ కారణంతోనే ఓటమిపాలైందని.. పంజాబ్ కెప్టెన్ అశ్విన్​పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరి మధ్య మ్యాచ్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.

పంజాబ్ జట్టు బౌలింగ్​లో స్థిరత్వం కనిపించట్లేదు. ముంబయితో జరిగిన మ్యాచ్​లో 197 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడింది. పొలార్డ్ 31 బంతుల్లో 83 పరుగులు చేసి కింగ్స్​ ఎలెవన్​కు విజయాన్ని దూరం చేశాడు.

షమి, ఆండ్రూ టై లతో పాటు ఆల్ రౌండర్ సామ్ కరన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అశ్విన్ తప్ప మిగతావారు రాణించట్లేదు. ఈ మ్యాచ్​లో సారథికి బౌలర్లు సహకరించాలని జట్టు భావిస్తోంది. బ్యాటింగ్​లో మయాంక్ అగర్వాల్, మిల్లర్, సామ్ కరన్, మన్​దీప్ సింగ్ రాణించాల్సిన అవసరం ఉంది.

గత మ్యాచ్​లో ముంబయిపై విజయంతో రాజస్థాన్ జోరుమీదుంది. బట్లర్ ఫామ్ రాయల్స్​కు కలిసొచ్చే అంశం. రహానే, శాంసన్, స్మిత్ కూడా కీలక సమయంలో విలువైన పరుగులు జోడిస్తున్నారు. బౌలర్ల విషయానికొస్తే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఉనద్కట్, ధవల్ కులకర్ణి, శ్రేయస్ గోపాల్ కూడా రాణిస్తున్నారు. గత మ్యాచ్​లో గాయంతో దూరమైన స్టోక్స్ ఈ మ్యాచ్​లో ఆడతాడని జట్టు భావిస్తోంది.

జట్లు (అంచనా)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కరన్, మహమ్మద్ షమి, సర్ఫ్​రాజ్ ఖాన్​, క్రిస్​గేల్, కేఎల్ రాహుల్, అంకిత్ రాజ్​పుత్​, మయాంక్​ అగర్వాల్​, కరుణ్​ నాయర్​, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్​.

రాజస్థాన్​ రాయల్స్:

అజింక్య రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి.

ABOUT THE AUTHOR

...view details