సొంతగడ్డపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 170 పరుగులే చేయగలిగింది పంజాబ్. రాహుల్ (79 పరుగులు) పోరాడినా ఫలితం లేకపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు వార్నర్, సాహా శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాహా ఔటయ్యాడు.
చివరి మ్యాచ్‌లో అదరగొట్టిన వార్నర్
ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత ఐపీఎల్లో 12 మ్యాచ్‌లాడిన వార్నర్.. 9 అర్ధ సెంచరీలతో పాటు 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.