ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... ముంబయి సారథి రోహిత్ సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన రోహిత్... ఈరోజు ముంబయి సారథిగా 100వ మ్యాచ్ ఆడుతున్నాడు.
సెంచరీ మ్యాచ్‌ల సారథిగా హిట్‌మ్యాన్ - హిట్‌మ్యాన్
ఐపీఎల్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్రెడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. రోహిత్‌శర్మ ముంబయి సారథిగా 100వ మ్యాచ్ ఆడుతున్నాడు.
సెంచిరీ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌కు విజయమేనా...??
మూడో స్థానం...మూడు టైటిల్స్:
కెప్టెన్‌గా బరిలోకి దిగిన 99 మ్యాచుల్లో 57 విజయాలు, 41 ఓటములు ఖాతాలో వేసుకున్నాడు రోహిత్‌శర్మ. ఒక మ్యాచ్ టై అయింది.
- రోహిత్ 57 విజయాలతో సారథులలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాలలో ధోనీ 100 విజయాలు, గంభీర్ 71 విజయాలతో ఉన్నారు.
- రోహిత్ కెప్టెన్సీలోనే ముంబయి జట్టు మూడుసార్లు (2013, 2015, 2017) కప్పు గెలుచుకుంది.