తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేటి మ్యాచ్​కు ప్రేక్షకుల గ్యాలరీలో గంగూలీ...! - eden gardens

నేడు కోల్​కతా నైట్​రైడర్స్​తో జరగనున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ సలహాదారు గంగూలీ ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోనున్నాడు. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా జరిగే మ్యాచ్​లో ఓ సాధారణ అభిమానిగా కనిపించనున్నాడు.

ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేయనున్న గంగూలీ

By

Published : Apr 12, 2019, 1:20 PM IST

నేడు ఐపీఎల్​ 26వ మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడనుంది దిల్లీ జట్టు. దిల్లీ క్యాపిటల్స్​ సలహాదారుడు గంగూలీ... ఆ జట్టు ట్రైనింగ్​ సెషన్​ అనంతరం వీక్షకుల గ్యాలరీకే పరిమితం కానున్నాడు.

బంగాల్​ క్రికెట్​ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ దిల్లీ జట్టుకు మెంటార్​గా వ్యవహరించడంపై గతంలో బీసీసీఐకు ఫిర్యాదు అందింది. మ్యాచ్​ జరుగుతున్న ఈడెన్​ గార్డెన్స్​ క్యురేటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు అందులో పేర్కొన్నారు ఫిర్యాదుదారులు. ఈ అంశంపై దిల్లీ క్యాపిటల్స్​ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క మ్యాచ్​కు ఆట ముగిసే వరకు ప్రేక్షకుల గ్యాలరీలోనే గంగూలీ ఉండనున్నట్లు కోచ్​ రికీ పాంటింగ్​ వెల్లడించాడు.

మ్యాచ్ రోజు పిచ్​ మీద గడ్డి పెరిగితే పేస్​ ప్రధానాస్త్రంగా బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు పాంటింగ్​.

ABOUT THE AUTHOR

...view details