తెలంగాణ

telangana

ETV Bharat / sports

చిన్న వయసులోనే ఎంతో 'ప్రయాస'.! - ప్రయాస్​ బర్మన్.

16 ఏళ్ల వయసున్న కుర్రాడు. ఒకవైపు చదువు.. మరోవైపు ఆట. దేన్నీ వదులుకోలేకపోతున్నాడు. ఒక్కసారిగా రెండు పరీక్షలు మూకుమ్మడిగా దాడి చేస్తే.. ఆనందపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమస్య ఎదుర్కొంటున్నది ఎవరో కాదు. ఇటీవల బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ప్రయాస్​ బర్మన్.

పాఠాలు, పోటీలతో ఇంత ప్రయాస

By

Published : Apr 1, 2019, 2:08 PM IST

Updated : Apr 1, 2019, 2:19 PM IST

పరీక్షకూహాజరు​...

మార్చి 31న సన్​రైజర్స్​తో ​జరిగిన మ్యాచ్​లో అరంగ్రేటం చేశాడు ప్రయాస్. పిన్న వయసులోనే ఐపీఎల్​ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

కోల్​కతాలోని ఓ ప్రైవేటు కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ఈ ఆటగాడు..రెండు రోజుల క్రితమేఎకనామిక్స్​​ పరీక్ష రాశాడు. అనంతరం ఆదివారం జరిగిన మ్యాచ్​లోతుది జట్టులో స్థానం సంపాదించాడు. టాస్​కు వెళ్లే కొన్ని నిముషాల ముందే కోహ్లీ ఎంపిక చేసినట్లు ప్రయాస్​ తండ్రి వెల్లడించాడు.ఏప్రిల్​ 3వ తేదీన జరగనున్న తదుపరిపరీక్షకుహాజరవుతాడని ప్రయాస్​ తండ్రి వెల్లడించారు.

'ఏప్రిల్​ 2న రాజస్థాన్​ మ్యాచ్​ తర్వాత ప్రయాస్​ కోల్​కతా వెళ్తాడు. 3న పరీక్ష రాసి.. 4న కోల్​కతా నైట్​రైడర్స్​తో​ మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడు. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితే అయినా జట్టు సహకారంతో సమన్వయం చేసుకోగలుగుతున్నాడు".
-- కౌశిక్​ రాయ్​ బర్మన్​, ప్రయాస్​ తండ్రి

ఆకట్టుకునే ఆరంభమే..

సన్​రైజర్స్​-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో తొలిసారి బరిలోకి దిగిన ప్రయాస్ ఆరంభం​లోనే వార్నర్​, బెయిర్​స్ట్రో దెబ్బకు పరుగులు సమర్పించుకున్నాడు. కానీ బ్యాటింగ్​లో ఆకట్టుకున్నాడు. అనుభవమున్న బ్యాట్స్​మెన్​ ఔటైపోతున్న సమయంలో 24 బంతుల్లో 19 పరుగులతో మెప్పించాడు.

Last Updated : Apr 1, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details