రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్ మోరిస్ స్థానంలో సందీప్‌ను ఆడించనుంది దిల్లీ జట్టు. మరోవైపు మొయిన్ అలీ స్థానంలో క్లాసన్‌కు అవకాశమిచ్చింది బెంగళూరు.
పిచ్ పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. ముందు బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుంది. ఈ రోజు జట్టులో మూడు మార్పులు చేసిందిబెంగళూరు. టిమ్ సౌథి స్థానంలో శివమ్ దుబే ఆడనున్నాడు. అక్షదీప్ స్థానంలో గుర్కిరత్కు అవకాశమిచ్చింది.
దిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సులభంగా ప్లే ఆఫ్‌కు చేరుతుంది క్యాపిటల్స్. ఇప్పటికే ఆడిన 11 మ్యాచుల్లో ఏడు గెలిచి జోరుమీదుంది క్యాపిటల్స్. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది బెంగళూరు. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందే.
జట్లు