తెలంగాణ

telangana

ETV Bharat / sports

పడి పడి లేచిన సన్​రైజర్స్​.. దిల్లీ లక్ష్యం 163 - దిల్లీ

విశాఖలో దిల్లీతో జరుగుతున్న ఎలిమినేటర్​ మ్యాచ్​లో హైదరాబాద్ 162 పరుగులు చేసింది. ఆరంభంలో గప్తిల్ ఆకట్టుకోగా.. చివర్లో విజయ్​శంకర్, నబీ మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు తీశాడు.

సన్​రైజర్స్​

By

Published : May 8, 2019, 9:39 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో తలపడుతున్న ఎలిమినేటర్​ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​ బ్యాట్స్​మెన్ గప్తిల్(36) ఆరంభంలో ఆకట్టుకున్నాడు. చివర్లో విజయ్ శంకర్(25),​ నబీ(20) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

స్పిన్​కు​ అనుకూలిస్తున్న పిచ్​పై హైదరాబాద్​ను మోస్తరు పరుగులకే కట్టడి చేసింది దిల్లీ. కీమో పాల్ మూడు వికెట్లతో రాణించగా.. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన హైదరాబాద్​ ఆరంభంలోనే సాహా(8) వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ గప్తిల్ ధాటిగా ఆడి స్కోరు వేగం పెంచాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేసిన గప్తిల్ ఏడో ఓవర్లో మిశ్రా బౌలింగ్​లో ఔటయ్యాడు. అనంతరం సన్​రైజర్స్​ ఇన్నింగ్స్​ నిదానంగా సాగింది. విలియమ్సన్​(28), మనీశ్​ పాండే(30) వేగంగా ఆడలేకపోయారు. వీరిద్దరూ ఔటైన తర్వాత చివర్లో మెరుపులు మెరిపించారు నబీ, విజయ్​శంకర్.

17వ ఓవర్ వరకు నిదానంగా సాగింది సన్​రైజర్స్​ ఇన్నింగ్స్​. ఆ ఓవర్లో 12 పరుగులు చేసిన నబీ- విజయ శంకర్ జోడి.​ తర్వాత ఓవర్లో 10 పరుగుల చేసింది. 19 ఓవర్లో 14 పరుగుల రాబట్టుకుంది. చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేయగలిగింది సన్​రైజర్స్ జట్టు.

ABOUT THE AUTHOR

...view details