ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెటర్లతో పాటు వారి పిల్లలు అంతే సందడి చేస్తున్నారు. వెంట ఉండి వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలాంటి సంఘటనే బుధవారం జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరులో వార్నర్ కూతురు చేసిన సందడి అంతా ఇంతా కాదు. 'గో డాడీ' అంటూ రాసిన బోర్డుతో కెమెరా కంటికి చిక్కింది. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కూతురు చెప్పింది.. నాన్న గెలిచాడు.. - హైదరాబాద్ క్రికెట్ స్టేడియం
స్టేడియంలో వార్నర్‌ను ఉత్సాహపరుస్తూ.. 'గో డాడీ' అంటూ అతడి కూతురు చేసిన సందడి నెట్టింట వైరల్ అవుతోంది.
కూతురు చెప్పింది..నాన్న గెలిచాడు..
వరుసగా మూడింట్లో ఓటమి పాలైన హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 25 బంతుల్లో 50 పరుగులు చేసిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఇది చదవండి: సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్ అలవోక విజయం