తెలంగాణ

telangana

ETV Bharat / sports

131 పరుగులకే చెన్నైని కట్టడి చేసిన ముంబయి

చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్ 131 పరుగులు చేసింది. ధోనీ (37), రాయుడు (42) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు తీశాడు.

సీఎస్​కే

By

Published : May 7, 2019, 9:36 PM IST

ముంబయి ఇండియన్స్​తో జరుగుతున్న ఐపీఎల్ మొదటి క్వాలిఫైర్​లో చెన్నై సూపర్​కింగ్స్​ 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. చెపాక్ వేదికగా తలపడుతున్న ఈ మ్యాచ్​లో ధోనీ (37, 29 బంతుల్లో), రాయుడు (42, 37 బంతుల్లో) ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా.. కృణాల్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేనకు శుభారంభం దక్కలేదు. 6 పరగుల వద్దే డూప్లిసిస్ (6) వికెట్ కోల్పోగా.. అనంతరం కొద్దిసేపటికే రైనాను (5) జయంత్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మరికొద్దిసేపటికే వాట్సన్ ​(10) కూడా వెనుదిరిగాడు. పవర్​ ప్లేలో కేవలం 32 పరుగులే చేసింది చెన్నై. అనంతరం మురళి విజయ్ (26) నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు.

విజయ్​ను రాహుల్ చాహర్ ఔట్​ చేయగా.. తర్వాత వచ్చిన ధోనీ - రాయుడు జోడి స్కోరు వేగాన్ని పెంచారు. జయంత్ యాదవ్ బౌలింగ్​లో చెరో సిక్సర్ కొట్టి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మలింగ వేసిన 18వ ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి 15 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్ వేసిన బుమ్రా.. తొలి బంతికే మహీని ఔట్ చేయగా.. అది నోబాల్​గా తేలింది. ఈ ఓవర్లో చెన్నై 9 పరుగులు మాత్రమే చేసింది.

ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ డూప్లిసిస్, మురళీ విజయ్​ను ఔట్​ చేసి చెన్నై సూపర్​ కింగ్స్​ను దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సురేశ్​ రైనాను జయంత్ యాదవ్ ఔట్ చేయగా.. వాట్సన్​ను పెవిలియన్​కు పంపాడు కృణాల్ పాండ్య.

ABOUT THE AUTHOR

...view details