దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా గెలిచింది. ఓపెనర్లు వాట్సన్(50), డుప్లెసిస్(50) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఈ విజయంతో మే 12న జరిగే ఫైనల్లో ముంబయితో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్. ప్రస్తుత సీజన్లో 2 లీగ్ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్ లోనూ ధోని సేనను ఓడించింది ముంబయి.
దిల్లీ బౌలర్లలో బౌల్ట్, అమిత్ మిశ్రా, ఇషాంత్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు చెన్నై ఆటగాడు డుప్లెసిస్‌కు దక్కింది.
అర్ధశతకాలతో అదరగొట్టిన చెన్నై ఓపెనర్లు..
ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జంట అనంతరం బ్యాట్‌కు పనిపెంచారు. జట్టు స్కోరు 48 వద్దే 42 పరుగులతో మంచి జోరుమీదున్న డుప్లెసిస్.. 38 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. అనంతరం బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వాట్సన్ నెమ్మదిగా ఆరంభించినా.. తర్వాత రెచ్చిపోయాడు. 31 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
వీరిద్దరు ఔటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించినా... అప్పటికే విజయం ఖరారైంది. చివర్లో రాయుడు(19), బ్రావో(4) మిగతా పని పూర్తి చేశారు. తొలి ఓవర్లో ఒక్క పరుగే చేసిన చెన్నై మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
దిల్లీలో పంత్ ఒక్కడే....
ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్(38), మన్రో(27) మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి క్యాపిటల్స్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీపక్, జడేజా, హర్భజన్, బ్రేవో తలో రెండు వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించారు.
చెన్నై- ముంబయి మ్యాచ్ ప్రత్యేకతలు..
ముంబయితో ఇప్పటికే మూడు సార్లు ఫైనల్లో తలపడింది చెన్నై.
- 2010లో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 22 పరుగుల తేడాతో గెలిచింది.
- 2013లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 2015లో కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ముంబయి 41 పరుగుల తేడాతో నెగ్గింది.
- ఇంతవరకూ ఐపీఎల్ ఫైనల్ ఆడని ఏకైక జట్టుగా దిల్లీ రికార్డు సృష్టించింది.
- 2011 నుంచి ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లే ఏడు సార్లు ఫైనల్లో తలపడ్డాయి. కేవలం రెండు సార్లే (2012, 2016) ఇతర జట్లు ఫైనల్కొచ్చాయి.