తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ ఫైనల్​కు వెళ్లేది కుర్రాళ్లా.. సీనియర్లా? - విశాఖ

ఐపీఎల్​ తుది అంకానికి సిద్ధమైంది. విశాఖపట్నంలో క్వాలిఫైయర్​-2 మ్యాచ్​లో దిల్లీ-చెన్నై జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఆట ప్రారంభం కానుంది.

సీఎస్​కే

By

Published : May 10, 2019, 7:01 AM IST

ఒకటేమో సీనియర్లతో నిండిన జట్టు.. మరొకటి కుర్రాళ్లతో ఉరకలెత్తుతున్న జట్టు.. మొదటిది చెన్నై సూపర్ కింగ్స్, రెండోది దిల్లీ క్యాపిటల్స్. ప్రస్తుత ఐపీఎల్​లో ఇరుజట్లు నిలకడగా రాణించి ఇక్కడి వరకు వచ్చాయి. నేడు విశాఖలో జరిగే క్వాలిఫైయర్-2 ​లో హోరా హోరీగా తలపడనున్నాయి. గెలిచిన జట్టు మే 12న హైదరాబాద్​లో జరిగే ఫైనల్​ పోరుకు వెళుతుంది.

కుర్రాళ్లతో కప్పు వేటలో దిల్లీ..

బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​లో హైదరాబాద్​ను సమష్టిగా ఓడించింది దిల్లీ. పంత్ 49, పృథ్వీషా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్​లో దిల్లీదే పైచేయి.

చెన్నైతో జరిగే మ్యాచ్​లోనూ వీరిద్దరూ రాణిస్తే దిల్లీ గెలుపు సులభమే. కానీ చెన్నై బౌలింగ్​ను ఎదుర్కొని వీరు ఎలా ఆడుతారన్నదే ప్రశ్న. గత మ్యాచ్​లో తక్కువ పరుగులకే వెనుదిరిగిన ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఈ నిర్ణయాత్మక పోరులో ఫామ్​ను అందుకోవాల్సి ఉంది.

ఇదే మైదానంలో హైదరాబాద్​ జట్టుపై విజయం సాధించడం దిల్లీకి కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దిల్లీ క్యాపిటల్స్​కు తిరుగుండదు.

బౌలర్లు అమిత్ మిశ్రా, కీమో పాల్, ఇషాంత్ శర్మ, బౌల్ట్.. మరోసారి అస్త్రాల్ని సంధించాల్సిన అవసరముంది.

అనుభవం చెన్నైకి పనికొస్తుందా..

క్వాలిఫైయర్, ఫైనల్​ మ్యాచ్​లంటే చెన్నై సూపర్​ కింగ్స్ పూర్తిగా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మూడుసార్లు విజేతగా అవతరించింది. నాలుగుసార్లు రన్నరప్​గా నిలిచింది.

గత మ్యాచ్​లో ముంబయి చేతిలో ఓటమి చెన్నైని ఆత్మరక్షణలో పడేసింది. చెపాక్​లో ఆ జట్టు బ్యాట్స్​మెన్ వైఫల్యం చెందారు. నిర్ణీత ఓవర్లలో తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగారు. రాయుడు, ధోని మినహా మరే ఇతర బ్యాట్స్​మెన్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.

ప్రస్తుతం మ్యాచ్​కు వాట్సన్, డుప్లెసిస్, రైనా, మురళీ విజయ్ ఫామ్​ను అందుకోవాల్సి ఉంది. బౌలర్లు హర్భజన్, తాహిర్, శార్దుల్ ఠాకుర్, బ్రావో మరోసారి మెరవాల్సిన అవసరముంది.

జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్

వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోని(కెప్టెన్), మురళీ విజయ్, బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్, తాహిర్, శార్దుల్ ఠాకుర్, శాంట్నర్

దిల్లీ క్యాపిటల్స్

ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), కొలిన్ మన్రో, రిషభ్ పంత్, రూథర్​ఫర్డ్, అక్షర్ పటేల్, కీమోపాల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, బౌల్ట్

ABOUT THE AUTHOR

...view details