తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన మనీశ్, వార్నర్​.. చెన్నై లక్ష్యం 176 - IPL

చెపాక్​ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్​ 175 పరుగులు చేసింది. మనీశ్​పాండే (83), వార్నర్​లు (57) అర్ధశతకాలతో అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో హర్భజన్​ రెండు వికెట్లు తీశాడు.

సన్​రైజర్స్​

By

Published : Apr 23, 2019, 9:48 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో మనీశ్ పాండే (83, 49 బంతుల్లో), డేవిడ్ వార్నర్​ (57, 47 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. ఈ సీజన్​లో అంతగా ఆకట్టుకోని మనీశ్ పాండే ఈ మ్యాచ్​లో సత్తా చాటాడు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్​ రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ జట్టు ఆరంభంలోనే బెయిర్​ స్టో వికెట్ ​(0) కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన మనీశ్ పాండే ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. వార్నర్​తో కలిసి స్కోరు వేగం పెంచాడు. తొలి ఆరు ఓవర్లలో 54 పరుగుల చేసిందీ ఈ జోడి. పది ఓవర్లకే 91 పరుగులు రాబట్టింది. అనంతరం 14 ఓవర్లో వార్నర్​ స్టంపౌట్​గా వెనుదిరిగాడు. వార్నర్​ ఔటైన తర్వాత సన్​రైజర్స్​ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. విజయ్​శంకర్ 26 పరుగులతో ఫర్వాలేదు అనిపించాడు. చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే చేసింది హైదరాబాద్​ జట్టు.

మనీశ్​పాండే మెరుపులు..

ఈ సీజన్​లో అంతగా ప్రభావం చూపని మనీశ్ పాండే చెపాక్​లో మెరుపులు మెరిపించాడు. విజయశంకర్​ స్థానంలో వన్​డౌన్​ బ్యాట్స్​మెన్​గా వచ్చిన మనీశ్ ధాటిగా ఆడాడు. 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వార్నర్​తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ABOUT THE AUTHOR

...view details