తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన వెలాసిటీ.. సూపర్​నోవాస్ బ్యాటింగ్ - ipl

జైపూర్ వేదికగా మహిళల టీ 20 ఛాలెంజ్​లో సూపర్​నోవాస్​తో జరుగుతున్న మ్యాచ్​లో వెలాసిటీ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాప్​-2లో నిలిచిన జట్లు ఫైనల్​లో తలపడతాయి.

మ్యాచ్​

By

Published : May 9, 2019, 7:18 PM IST

మహిళల టీ 20 ఛాలెంజ్​లో సూప్​నోవాస్​తో జరుగుతున్న మ్యాచ్​లో​ వెలాసిటీ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మూడు టీమ్​లకు మధ్య జరిగే ఈ టోర్నీలో టాప్​- 2 లో ఉన్న జట్లు ఫైనల్లో తలపడతాయి.

వెలాసిటీ ఇప్పటికే ఓ మ్యాచ్​ గెలవగా.. సూప్​నోవాస్ ఓ మ్యాచ్​లో పరాజయం చెందింది. ఇందులో సూపర్​నోవాస్ గెలిస్తే టాప్​-2లో అడుగుపెట్టే అవకాశముంది. రెండు మ్యాచ్​లాడిన ట్రైల్​ బ్లేజర్​ ఓ దాంట్లో ఓడి మరో మ్యాచ్​లో గెలిచింది. రన్​రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు టాప్​-2లో పోటీ పడతాయి.

జట్లు..

సూపర్​నోవాస్..

ప్రియా పునియా, చమారీ ఆటపట్టు, జెమ్మీ రోడ్రిగ్స్​, హర్మన్​ప్రీత్​ కౌర్(కెప్టెన్), నటాలీ, సోఫీ, లీ టహూ, తానియా(కీపర్), అనుజా పాటిల్, పూనమ్​ యాదవ్, రాధా యాదవ్.

వెలాసిటీ..

హేలీ మ్యాథ్యూస్, షెఫాలీ వర్మ, వ్యాట్, మిథాలీ రాజ్(కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, సుష్మా వర్మ(కీపర్), శిఖాపాండే, ఆలం, అమిలీయా, కోమల్, ఏక్తా బిష్త్

ABOUT THE AUTHOR

...view details