తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​ యూ... లిటిల్​ బిస్కెట్​: డివిలియర్స్​ - యూ లిటిల్‌ బిస్కెట్‌

ఐపీఎల్‌ 12వ సీజన్​లో ఈడెన్​గార్డెన్స్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో  కోహ్లీ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్​... 'లిటిల్​ బిస్కెట్'​ అంటూ ట్వీట్​ చేశాడు.

కోహ్లీకి నిక్​నేమ్​ పెట్టిన డివిలియర్స్​

By

Published : Apr 20, 2019, 11:35 PM IST

శుక్రవారం సొంతగడ్డపై కోల్​కతా నైట్​రైడర్స్​ను ఓడించిన కోహ్లీ జట్టు ఐపీఎల్​లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు ఆర్​సీబీ కెప్టెన్‌ కోహ్లి. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్​కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు విరాట్​. ఐపీఎల్‌లో ఐదో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

అయితే ఈ మ్యాచ్​లో అస్వస్థత కారణంగా తుది జట్టుకు దూరమైన ఏబీ డివిలియర్స్‌...కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. శతకం సాధించిన వెంటనే ట్వీట్​ చేశాడు.

" విరాట్‌...యూ లిటిల్‌ బిస్కెట్‌. మొయిన్‌ అలీతో కలిసి బౌలర్లను హడలెత్తించావు. ఫస్ట్‌ ఆఫ్‌ వెరీగుడ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు.

మ్యాచ్​ తర్వాత ఆర్​సీబీ అభిమానులు... కోహ్లీ నిక్‌నేమ్‌ బాగుందంటూ ఏబీని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కోహ్లీని రన్‌ మెషీన్‌, చీకూ, కింగ్‌ కోహ్లీ అని పిలుస్తుంటారు. తాజాగా లిటిల్​ బిస్కెట్​ పేరూ జాబితాలో చేరింది.

ABOUT THE AUTHOR

...view details