ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే(T20 World Cup India Team) టైటిల్ ఫేవరెట్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq News) అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసినా భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నాడు.
"ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే టీమ్‌ఇండియాకే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు" అని ఇంజమామ్ అన్నాడు.
అక్టోబరు 24న భారత్, పాక్ మధ్య హై ఓల్టేజి మ్యాచ్(Ind vs Pak T20 World Cup) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ఇంజమామ్ మాట్లాడాడు.
"సూపర్ 12 దశలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్‌కు ముందు ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లు ఫైనల్స్‌ను తలపించాయి"