తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​లో కోహ్లీ అండ్​ బాయ్స్​.. జాలీ జాలీగా! - కేఎల్​ రాహుల్​

విరాట్​ కోహ్లీ, ఇషాంత్​ శర్మ, ఉమేశ్​ యాదవ్​, మయాంక్​ అగర్వాల్​తో కలిసి దిగిన ఫొటోను కేఎల్​ రాహుల్​ షేర్​ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్ట్​ సిరీస్​ కోసం సన్నద్ధమవుతోంది టీమ్ఇండియా.

TEAM INDIA
టీమ్​ఇండియా

By

Published : Jul 30, 2021, 6:51 PM IST

ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లు ఓ ఫొటోషూట్​ నిర్వహించారు. ఈ ఫొటోలను కే.ఎల్​ రాహుల్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశాడు.

కోహ్లీ అండ్​ బాయ్స్​

కొన్ని ఫొటోల్లో విరాట్​ కోహ్లీ స్టైలిష్​ లుక్స్​తో అదరగొట్టాడు. ఇంకో ఫొటోలో ఉమేశ్​ యాదవ్​, విరాట్​, కేఎల్​ రాహుల్​, ఇషాంత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​ కనపడ్డారు. అయితే ఈ పిక్​ షేర్​ చేస్తూ.. "ఈ ఫొటో తీసింది ఎవరో తెలుసా?" అన్న క్యాప్షన్​ జోడించాడు రాహుల్​. అనంతరం విరాట్​ సతీమణి అనుష్క శర్మ, రాహుల్​ గర్ల్​ఫ్రండ్​, నటి అథియా శెట్టి ఫొటో తీస్తున్న పిక్​ను షేర్​ చేశాడు. ఆ ఫొటోలో ఉమేశ్​ భార్య తన్యా వాద్వా, ఇషాంత్​ సతీమణి ప్రతిమా సింగ్​, బీసీసీఐ మీడియా బృందం సీనియర్​ ప్రొడ్యూసర్​ రాజల్​ ఆరోరా కూడా ఇందులో ఉన్నారు.

ఫొటో తీసింది వీరే...

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కోహ్లీ అండ్​ బాయ్స్​ స్టైలిష్​ స్టిల్స్​ చూసి అభిమానులు వావ్​ అంటున్నారు.

విరాట్​ స్టైలిష్​ లుక్​
విరాట్​
కేఎల్​ రాహుల్​

డబ్ల్యూటీసీ ఫైనల్​ అనంతరం.. ఇంగ్లాండ్​తో సుదీర్ఘ పర్యటన కోసం దాదాపు రెండు నెలలుగా ఆ దేశంలోనే ఉంటోంది టీమ్​ఇండియా. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ ట్రెంట్​ బ్రిడ్జ్​ వేదికగా ఆగస్టు 4న ప్రారంభం అవుతుంది. రెండో టెస్టు లార్డ్స్​ వేదికగా ఆగస్టు 12 నుంచి జరగనుంది.

టీమ్​ఇండియా

ఇదీ చూడండి:-ఇంగ్లాండ్​ పర్యటనకు సూర్య, పృథ్వీ షా..

ABOUT THE AUTHOR

...view details