తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్టోబర్​ 24న భారత్‌- పాక్‌ మ్యాచ్ - T20 world cup

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా భారత్​-పాక్​ మధ్య జరిగే మ్యాచ్​ను అక్టోబర్​ 24న జరగనుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

teamindia
టీమ్​ఇండియా

By

Published : Aug 4, 2021, 1:43 PM IST

దుబాయ్​ వేదికగా అక్టోబర్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్​ తేదీ ఖరారైంది. అక్టోబర్​ 24న ఇరు జట్లు తలపడనున్నాయి.

మార్చి 2021నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఇటీవలే ఈ మెగాటోర్నీకి సంబంధించిన డ్రాను ప్రకటించారు. ఇందులో దాయాది దేశాలు భారత్-పాక్​ ఒకే గ్రూప్​లో ఉన్నాయి. దీనిని సూపర్ 12 మ్యాచ్​లుగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది.

గ్రూప్ 1- వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్

గ్రూప్ 2- భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్​-బీ విజేత

క్వాలిఫయర్స్

టీ20 ప్రపంచకప్​లో క్వాలిఫై కోసం ఏకంగా ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. వీటి మధ్య రౌండ్ 1 పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో గ్రూప్​ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్​, నమీబియా ఉన్నాయి. గ్రూప్ బీ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఈ క్వాలిఫయర్స్​లోని గ్రూప్​ ఏ విజేత, గ్రూప్ బీ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్​ 1లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికాలతో పోటీపడనున్నాయి. తర్వాత గ్రూప్ బీ విజేత​, గ్రూప్ ఏ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్ 2లోని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​, న్యూజిలాండ్​తో పోటీపడతాయి.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్: భారత్​- పాక్​ 'మ్యాచ్'​ ఫిక్స్​- ఫ్యాన్స్​ ఖుష్​

ABOUT THE AUTHOR

...view details