ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న (ben stokes news) యాషెస్ టెస్టు సిరీస్‌లో (ashes series 2021) ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఆడనున్నాడు. ఈ మేరకు స్టోక్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 4న జట్టు సభ్యులతో కలిసి ప్రయాణించనున్నాడని తెలిపింది.
"మానసిక అనారోగ్య కారణాల వల్ల ఇంతకాలం ఆటకు దూరం అయ్యాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. జట్టులోని సహచర సభ్యులను కలుసుకోవాలని అనుకుంటున్నా. ఆస్ట్రేలియా ప్రయాణానికి వేచి చూస్తున్నా."
-బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆటగాడు