తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs NZ TEST: ఈ రికార్డులు బద్దలు.. అవేంటంటే? - భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు రికార్డులు

IND vs NZ Test Record: న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 372 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్​ విజయంతో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

IND vs NZ latest news, IND vs NZ test Records, భారత్-న్యూజిలాండ్ టెస్టు రికార్డులు, భారత్-న్యూజిలాండ్ టెస్టు లైవ్ స్కోర్
IND vs NZ

By

Published : Dec 6, 2021, 12:06 PM IST

Updated : Dec 6, 2021, 12:23 PM IST

IND vs NZ Test Record: వాంఖడే వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 372 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా, టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం. అలాగే ఈ మ్యాచ్​తో మరిన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

  • ప్రతి ఫార్మాట్​లో 50 విజయాలు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ.
  • టెస్టు క్రికెట్​లో భారత్​కు ఎక్కువ విజయాలందించిన కెప్టెన్​గా కోహ్లీ మరో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం ఇతడు 39 టెస్టుల్లో టీమ్ఇండియాకు విజాయాన్నందించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి తర్వాతి స్థానంలో ఉన్న ధోనీ భారత జట్టుకు 27 విజయాలు అందించాడు.
  • భారత్ విజయం సాధించిన టెస్టుల్లో ఎక్కువసార్లు నాలుగు వికెట్లకుపైగా సాధించిన వారిలో కుంబ్లే సరసన నిలిచాడు అశ్విన్. వీరిద్దరూ 38 సార్లు ఈ ఘనత సాధించారు. హర్భజన్ 23, ఎర్రపల్లి ప్రసన్న తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • పరుగుల పరంగా ఇదే భారత్​కు అత్యంత భారీ విజయం. ఈ మ్యాచ్​లో కివీస్​పై 372 పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన. ఇంతకుముందు 2015లో దక్షిణాఫ్రికాపై 337 పరుగుల తేడాతో గెలిచింది భారత్.
  • పరుగుల పరంగా న్యూజిలాండ్​కిదే అత్యంత భారీ ఓటమి. ఈ మ్యాచ్​లో 372 కివీస్ ఓడిపోగా.. 2007లో దక్షిణాఫ్రికా చేతిలో 358 పరుగుల తేడాతో పరాజయం చెందింది
  • 2013 నుంచి స్వదేశంలో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్​ను ఓడిపోలేదు టీమ్ఇండియా. సొంతగడ్డపై భారత్​కు ఇది వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయం.
  • టెస్టు క్రికెట్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మరో మెట్టు ఎక్కాడు విరాట్ కోహ్లీ. ఇతడు ప్రస్తుతం 39 విజయాలతో ఉండగా.. స్టీవ్ వా (41), పాంటింగ్ (48), గ్రేమ్ స్మిత్ (53) ఇతడికంటే ముందున్నారు.
  • ఈ ఏడాది జరిగిన టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఏడాది భారత్ 7 విజయాలతో ఉండగా.. పాకిస్థాన్ 6, ఇంగ్లాండ్ 4 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఈ ఏడాది అశ్విన్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య 52కి చేరుకుంది. టెస్టుల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కిది నాలుగో సారి. 2015, 2016, 2017, 2021లో ఈ ప్రదర్శన చేసిన అశ్విన్‌.. అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇదివరకు హార్భజన్‌, కుంబ్లే 3 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. దీంతో ఆ ఇద్దరి దిగ్గజాలను అశ్విన్‌ ఇప్పుడు వెనక్కినెట్టాడు.
  • న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్‌ తీసిన వికెట్లు 66. రెండు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌.. కివీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ(65)ని అశ్విన్‌ అధిగమించాడు.
  • ఈ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ బౌలింగ్‌ గణాంకాలివి 14/225. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గానూ అతడు నిలిచాడు. కివీస్‌ తరపున టెస్టుల్లో అతడికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్‌ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.
  • భారత్‌లో న్యూజిలాండ్‌ ఆడిన 12 టెస్టు సిరీస్‌ల్లో ఒక్కసారి కూడా సిరీస్‌ కైవసం చేసుకోలేదు. చివరిసారిగా ఆ జట్టు 1988లో వాంఖడే మైదానంలోనే ఒక టెస్టు గెలిచింది.
  • స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు అశ్విన్. ఇతడి ఖాతాలో 300 వికెట్లుండగా.. కుంబ్లే 350 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవీ చూడండి: అంపైర్లందు ఈ అంపైర్ వేరయా.. వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇవ్వొచ్చా!

Last Updated : Dec 6, 2021, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details