తెలంగాణ

telangana

ETV Bharat / sports

మల్టీప్లెక్స్​లలో ​వరల్డ్ కప్​ మ్యాచ్​ల లైవ్.. ఏ ప్రాంతాల్లో అంటే? - ఐనాక్స్​ ఐసీసీ ఒప్పందం

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్! ఇకపై క్రికెట్ మ్యాచ్​లను థియేటర్లలో వీక్షించొచ్చు. ఈ మేరకు మ్యాచ్​లను మల్టీప్లెక్స్​లలో ప్రసారం చేసేందుకు ఐనాక్స్​ సంస్థ.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

INOX  live telecast India matches
INOX live telecast India matches

By

Published : Oct 11, 2022, 8:29 PM IST

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్ వచ్చింది. క్రికెట్​ మ్యాచ్​లను చిన్న చిన్న మొబైల్​, టీవీ స్క్రీన్లపై కాకుండా భారీ తెరలపై చూసే అవకాశం కల్పిస్తోంది ఐనాక్స్ సంస్థ. ఇకపై టీమ్​ ఇండియా ఆడే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్​లను మల్టీప్లెక్స్​లలో లైవ్​ ప్రసారం చేయనుంది. ఈ మేరకు ప్రపంచ క్రికెట్​ మండలి (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

25 నగరాలలో ఉన్న ఐనాక్స్ మల్టీప్లెక్స్​లలో మాత్రమే ఈ లైవ్​ మ్యాచ్​లను ప్రసారం కానున్నాయి. టీ20 వరల్డ్​ కప్​లో భాగంగా అక్టోబర్​ 23వ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో టీమ్ ఇండియా తలపడనుంది. మొదటగా ఈ మ్యాచ్​తోనే మ్యాచ్​ల మల్టీప్లెక్స్ లైవ్​ స్క్రీనింగ్ ప్రారంభం చేయనుంది ఐనాక్స్ సంస్థ.

"దేశంలో అత్యధిక మంది ప్రేమించే క్రికెట్​ను.. పెద్ద స్క్రీన్​ అనుభూతితో.. మంచి సౌండ్​ ఎఫెక్ట్​తో అందిస్తున్నాం. దీనికి వరల్డ్​ కప్​ ఉత్సాహం, ఎమోషన్​ తోడైతే.. క్రికెట్​ అభిమానులకు వర్చువల్​ ట్రీట్​ అవుతుంది" అని ఐనాక్స్ సీఓఓ ఆనంద్ విశాల్​ అన్నారు. ప్రస్తుతం ఐనాక్స్​కు దేశ వ్యాప్తంగా 74 నగరాల్లో 165 మల్టీప్లెక్స్​లు ఉన్నాయి. అవి 705 స్క్రీన్లతో, 1.57 లక్షల సీటింగ్ కెపాసిటీతో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో పీవీఆర్ సంస్థతో కలిసి.. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లేక్స్​ గొలుసును నెలకొల్పింది ఐనాక్స్ సంస్థ.

ఇవీ చదవండి:సఫారీలపై భారత్​ ఘన విజయం.. 2-1 తేడాతో సిరీస్​ కైవసం

తెలుగు సినిమాలకు నిర్మాతగా ధోని.. ఆ స్టార్​ హీరోయిన్​తో ఎంట్రీ..!

ABOUT THE AUTHOR

...view details