ravindra jadeja asia cup : భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. ఆసియా కప్‌కు ఆడుతున్న సమయంలో అతనికి కుడి మోకాలికి గాయం కావడం వల్ల ఇకపై జరగనున్న మ్యాచ్‌లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది. అతడు ఇప్పుడు బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. కాగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆసియా కప్‌లో టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో కీలక వికెట్ తీశాడు. ఇప్పుడు కీలక సమయంలో గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై ప్రభావం పడుతుందని క్రీడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.