తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDvsENG: మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. మూడో రోజు ఎంతో పట్టుదల ప్రదర్శించిన భారత బ్యాట్స్​మెన్ నాలుగో రోజు చేతులెత్తేయడం వల్ల ఇన్నింగ్స్​ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది కోహ్లీసేన.

kohli
కోహ్లీ

By

Published : Aug 28, 2021, 4:51 PM IST

Updated : Aug 28, 2021, 5:22 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘోర ఓటమిపాలైంది టీమ్ఇండియా. మూడో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత బ్యాట్స్​మెన్ నాలుగో రోజు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లు బ్యాట్స్​మెన్​పై ఒత్తిడి పెంచి వికెట్లు కూల్చడంలో సఫలమయ్యారు. దీంతో నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే పుజారా (91), కోహ్లీ (55), రహానే (10), పంత్​(1)ల వికెట్లు తీసి భారత్​ను కోలుకోకుండా చేశారు. టెయిలెండర్లు కూడా పోరాటం చేయకుండానే వెనుదిరగడం వల్ల ఇన్నింగ్స్​ 76 పరుగుల తేడాతో పరాజయం చెందింది కోహ్లీసేన.

టపటపా

ఓవర్​నైట్ స్కోర్ 215/2తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన ఎంతసేపూ నిలవలేదు. మూడో రోజు ఎంతో పట్టుదలతో ఆడిన కోహ్లీ, పుజారా వెంటవెంటనే పెవిలియన్ చేరారు. పుజార్ ఓవర్​నైట్ స్కోర్ 91 పరుగుల వద్దే వెనుదిరిగాడు. అర్ధసెంచరీ చేసిన కోహ్లీ జట్టును ఆదుకుంటాడని భావించినా.. మరో ఐదు పరుగులు జోడించి 55 రన్స్ వద్ద అండర్సన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. రహానే (10), పంత్ (1) దారుణంగా విఫలమయ్యారు. దీంతో మూడు పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. అనంతరం జడేజా కాసేపు మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 30 పరుగులు చేసి ఆశలు రేకెత్తించాడు. కానీ కాసేపటికే ఓవర్టన్ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాస్త పోరాటమైనా కనబరుస్తారనుకున్న టెయిలెండర్లు నిరాశపర్చారు. షమీ (6), ఇషాంత్ (2), సిరాజ్ (0) విఫలమవడం వల్ల భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇన్నింగ్స్​ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్.

ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఓవర్టన్ 3, అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.

ఇవీ చూడండి: స్పిన్ బౌలింగ్​లోనూ హెల్మెట్​తో.. ఈసీబీ రూల్ ఏం చెబుతోంది?

Last Updated : Aug 28, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details