తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 7:29 PM IST

ETV Bharat / sports

IND VS SL: శ్రీలంక పర్యటన షెడ్యూల్​ ఇదే

శ్రీలంక సిరీస్​ షెడ్యూల్​ను ప్రకటించింది ప్రసారదారు సోనీ. ఇరు జట్లు మూడు వన్డేలు(జులై 13,16,18), మూడు టీ20లు(21,23,25) ఆడనున్నట్లు వెల్లడించింది.

IND VS SL
శ్రీలంక పర్యటన

శ్రీలంక పర్యటన షెడ్యూల్​ను ప్రకటించింది మ్యాచ్​ల ప్రసారదారు ​సోనీ. జులై 13 నుంచి 25 వరకు జరగనున్నట్లు తెలిపింది. ఇరు జట్లు మూడు వన్డేలు(జులై 13,16,18), మూడు టీ20లు(21,23,25)వ తేదీల్లో ఆడనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్​లు నిర్వహించే వేదికలను ప్రకటించలేదు.

చాలా ఏళ్ల తర్వాత భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్​ పర్యటనలో ఉంది. అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్​(జున్​ 18-22), ఇంగ్లాండ్​ సిరీస్​(ఆగస్టు4-సెప్టెంబరు 14) ఆడనుంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు శిఖర్​ ధావన్​, హార్దిక్ పాండ్య, శ్రేయస్​ అయ్యర్​.. వీరిలో ఒకరు సారథిగా వ్యవహరించే అవకాశముంది.

ఇదీ చూడండి IND VS SL: 'భారత జట్టు గెలిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details