తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​ను తిరిగి నిర్వహించడం సవాలే'​

కొవిడ్ నేపథ్యంలో నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ను తిరిగి నిర్వహించడం సవాలుతో కూడినదని పేర్కొన్నారు రాజస్థాన్​ రాయల్స్​ యజమాని మనోజ్ బదాలే. ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేదే కష్టమైన అంశమని పేర్కొన్నారు.

manoj badale, rajasthan royals owner
రాజస్థాన్ రాయల్స్, మనోజ్ బదాలే

By

Published : May 14, 2021, 9:36 AM IST

వాయిదా పడిన ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ను తిరిగి నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు రాజస్థాన్ రాయల్స్​ యజమాని మనోజ్​ బదాలే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల క్రికెట్ క్యాలెండర్​ ఇప్పటికే నిర్ణయం కావడం వల్ల.. ఐపీఎల్​ నిర్వహణ కష్టమేనని పేర్కొన్నారు.

"ఐపీఎల్​ను ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేదే అతిపెద్ద అంశం. ఇప్పటికే క్రికెటర్లు చాలా క్రికెట్ ఆడారు. వీలైనన్నీ ఎక్కువ మ్యాచ్​లు ఆడటానికి పలు బోర్డులు ఒప్పందాలు చేసుకున్నాయి. ఎక్కువగా టెస్టు మ్యాచ్​లు ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నాయి."

-మనోజ్ బదాలే, రాజస్థాన్ రాయల్స్​ యజమాని.

'అయితే ఐపీఎల్​ నిర్వహణకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. యూకే వేదికగా సెప్టెంబర్​లో టోర్నీ నిర్వహించొచ్చు! టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో అది కూడా చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పాలి' అని బదాలే తెలిపారు.

టోర్నీలో కొవిడ్​ కేసులు పెరగడం వల్ల ఐపీఎల్​ 14వ సీజన్​ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. లీగ్​లో 7 మ్యాచ్​లాడిన రాజస్థాన్​.. 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉండగా.. మిగిలిపోయిన ఐపీఎల్​లో తమ ఆటగాళ్లు పాల్గొనేది అనుమానమేనని.. ఇంగ్లాండ్​ పురుషుల జట్టు మేనేజింగ్ డైరెక్టర్​ యాష్లే గైల్స్​ ప్రకటించారు.

ఇదీ చదవండి:'టీకా షాట్​ తీసుకుందాం.. కరోనాను ఔట్‌ చేద్దాం'

ABOUT THE AUTHOR

...view details