కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిచిపోయిన రంజీ ట్రోఫీ మళ్లీ మొదలైంది. దేశవాళీ ఆటగాళ్లు సత్తా చాటుకునే ఈ ట్రోఫీ గురువారమే ప్రారంభమవనుంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 38 జట్లతో బయో సెక్యులర్ వాతావరణంలో మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్ల కోసం దేశవ్యాప్తంగా ఎనిమిది చోట్ల బయో బబుల్స్ ఏర్పాటు చేశారు.
ఈ దేశవాళీ ఆటల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌరాష్ట్ర, 41 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి మధ్య పోరుపైనే ఆసక్తి నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో విఫలమైన రహానె, పుజారాలు ఈ జట్ల తరపున బరిలో దిగనున్నారు. ఈ మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేసి శ్రీలంకతో త్వరలో జరిగే టెస్టు సిరీస్ కోసం జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు.
మొదటి రౌండ్ మ్యాచ్‌లు:
- కర్ణాటక vs రైల్వేస్, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై).
- హైదరాబాద్ vs చండీగఢ్, ఎలైట్ గ్రూప్ బి (భువనేశ్వర్)
- బంగాల్ vs బరోడా, ఎలైట్ గ్రూప్ బి (కటక్)
- కేరళ vs మేఘాలయ, ఎలైట్ గ్రూప్ ఏ (రాజ్‌కోట్)
- గుజరాత్ vs మధ్యప్రదేశ్, ఎలైట్ గ్రూప్ ఏ (రాజ్‌కోట్)
- మణిపూర్ vs అరుణాచల్ ప్రదేశ్, ప్లేట్ (కోల్‌కతా)
- జమ్మూ కశ్మీర్ vs పుదుచ్ఛేరి, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై)
- సౌరాష్ట్ర vs ముంబయి, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
- ఒడిశా vs గోవా, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
- నాగాలాండ్ vs సిక్కిం, ప్లేట్ (కోల్‌కతా)
- బిహార్ vs మిజోరం, ప్లేట్ (కోల్‌కతా)
- ఝార్ఖండ్ vs ఛత్తీస్‌గఢ్, ఎలైట్ గ్రూప్ హెచ్ (గౌహతి)
- దిల్లీ vs తమిళనాడు, ఎలైట్ గ్రూప్ హెచ్ (గువహటి)
- మహారాష్ట్ర vs అసోం, ఎలైట్ గ్రూప్ జి (రోహ్తక్)
- విదర్భ vs ఉత్తర ప్రదేశ్, ఎలైట్ గ్రూప్ జి (గురుగ్రామ్)
- హరియాణా vs త్రిపుర, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (దిల్లీ)
- పంజాబ్ vs హిమాచల్ ప్రదేశ్, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (దిల్లీ)
- సర్వీసెస్ vs ఉత్తరాఖండ్, ఎలైట్ గ్రూప్ ఈ (తిరువనంతపురం)
- ఆంధ్ర vs రాజస్థాన్, ఎలైట్ గ్రూప్ ఈ (తిరువనంతపురం)
ఇదీ చదవండి:IPL 2022 KKR: కోల్‌కతా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్