తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Aus: ఆసీస్​ రికార్డు విజయాలకు చెక్ పెట్టిన భారత్ - క్రికెట్ లేటెస్ట్ న్యూస్

మూడో వన్డేలో ఆసీస్​ మహిళా జట్టుపై భారత్​(ind vs aus) గెలిచింది. సిరీస్​ ఓడినప్పటికీ, ప్రత్యర్థి జట్టు ఖాతాలో ఉన్న రికార్డు విజయాల్ని బ్రేక్ చేసింది.

Ind vs Aus
ఇండియా ఆస్ట్రేలియా వన్డే

By

Published : Sep 26, 2021, 1:51 PM IST

టీమ్​ఇండియా మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై(ind vs aus) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది(india result). అయితే ఈ సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​లు గెలిచిన ఆసీస్ జట్టు.. 2-1 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది.

వరుస విజయాలకు బ్రేక్

అయితే ఆస్ట్రేలియా వరుసగా 26 వన్డేలు గెలిచిన రికార్డుకు ఈ ఓటమితో బ్రేక్ పడింది. దీనికి కారణం టీమ్​ఇండియా కావడం విశేషం.

ఈ విజయం టెస్టు సిరీస్​కు ముందు టీమ్​ఇండియా(team india schedule 2021) మహిళలకు ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇండియా ఆస్ట్రేలియా వన్డే

ఆదివారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్(ind vs aus).. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా 8 కోల్పోయినప్పటికీ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్​లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జులాన్ గోస్వామి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details