టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై నెగ్గి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టు...తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ కేవలం 22 పరుగులే చేశాడు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి పటిష్ఠమైన బౌలింగ్ ఎటాక్‌లను ఎదుర్కొనేందుకు రాహుల్ తడబడ్డాడు. ఐతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను కొనసాగించేందుకే టీమ్‌మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం టోర్నీలో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ అర్థశతకంతో రాణించాడు.
ఇక వికెట్ కీపర్ దినేష్‌కార్తీక్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న రిషబ్ పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దినేష్‌కార్తీక్ గాయపడటంతో పంత్ తుదిజట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సహా నలుగురు లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులో కొనసాగిస్తారా లేదా అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకొస్తారా వేచి చూడాలి. పేసర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ రాణిస్తుండటం భారత్‌కు కలిసివచ్చే అంశం.