తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. జియో సినిమాలో ఫ్రీగా భారత్​- విండీస్​ సిరీస్​

Jiocinema India Vs West indies : క్రికెట్​ అభిమానులకు గుడ్​న్యూస్​. వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్ షిప్​ తర్వాత జరగనున్న భారత్​- వెస్టిండీస్​ సిరీస్​ను జియా సినిమాలో ఉచితంగా చూసేయొచ్చు. ఈ విషయాన్ని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు.

india west indies tour 2023 matches will be free streamed on jio cinema app jiocinema india vs west indies
india west indies tour 2023 matches will be free streamed on jio cinema app jiocinema india vs west indies

By

Published : Jun 7, 2023, 4:37 PM IST

Jiocinema India Vs West Indies : క్రికెట్‌ ప్రేమికులకు జియో సినిమా (రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌) శుభవార్త చెప్పింది. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ తర్వాత జరగనున్న భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12- ఆగస్ట్‌ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. దీంతో టీమ్​ఇండియా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థ్యాంక్స్​ టు జియో అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

India West Indies Tour 2023 : అయితే రెండు టెస్ట్​లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు.. జులై 12 నుంచి వెస్టిండీస్​లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్​ తొలుత టెస్ట్​లు, ఆ తర్వాత వన్డేలు, టీ20లు ఆడనుంది.

విండీస్‌ పర్యటన వివరాలు..

  • జులై 12-16- తొలి టెస్ట్‌, డొమినికా
  • జులై 20-24- రెండో టెస్ట్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
  • జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • ఆగస్ట్‌ 4- తొలి టీ20, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, ఫ్లోరిడా

నల్లరిబ్బన్లతో టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు..
WTC Final 2023 :మరోవైపు, టీమ్​ఇండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం ఓవల్‌ వేదికగా మొదలైంది. టాస్‌ గెలిచిన టీమ్​ఇండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు.

Odisha Train Accident : ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280 మందికిపైగా మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.​ టీమ్​ఇండియా, ఆసీస్‌ ఆటగాళ్ల చర్యను అభిమానులు స్వాగతించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడతామని టీమ్​ఇండియా పేర్కొనడం సంతోషాన్ని ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details