Mohali Test: పంజాబ్ మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ భారీ స్కోరు సాధించింది. భారత్ మూడు వికెట్లు కోల్పోయాక క్రీజులోకి వచ్చిన పంత్ మొదట్లో ఆచితూడి ఆడినా.. అర్ధ సెంచరీ తర్వాత బ్యాట్‌ను ఝుళిపించాడు. సిక్సర్లు ఫోర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 97 బంతుల్లో 96 చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ 28 పరుగుల వద్ద లహిరు కుమార బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 33 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Kohli 100th test
కోహ్లీ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..
రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ కుదురుకున్నట్లే కన్పించాడు. హనుమ విహారితో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం 45పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 44వ ఓవర్లో లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా వేసిన బంతికి క్లీక్ బౌల్డ్‌గా వెనుదరిగాడు. దీంతో స్టేడియంలో కాసేపు నిశ్శబ్దం ఆవహించింది. అయితే ఈ మ్యాచ్‌లో 8000 పరుగులు మైలురాయిని మాత్రం కోహ్లీ అధిగమించాడు. 38 పరగుల వద్ద ఈ రికార్డును చేరుకున్నాడు.
కోహ్లీ ఔటైన కాసేపటికే 58 పరగులు చేసిన హనుమ విహారి కూడా జట్టు స్కోరు 175వద్ద విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో బౌల్డ్‌గా అవుటయ్యాడు.