India VS South Africa Test Series: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కోహ్లీ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(5), శార్దుల్ ఠాకుర్(4) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు మహ్మద్ షమి ఐదు వికెట్ల ప్రదర్శనతో సౌతాఫ్రికా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌటైంది. బవుమా(52) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. డికాక్ (34), రబాడ (25) కాస్త సహకారం అందించారు.
భారత బౌలర్లలో షమి 5, బుమ్రా, శార్దుల్ రెండు వికెట్ల చొప్పున తీశారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
భారత్ 327 ఆలౌట్..
షమికి ఐదు వికెట్లు- 146 పరుగుల ఆధిక్యంలో భారత్ - india a vs south africa test series 2021
India VS South Africa Test Series: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు కూడా భారత్‌దే పైచేయి. సౌతాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేసి.. 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది కోహ్లీ సేన. అనంతరం.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్
ఓవర్‌నైట్ స్కోరు 272/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియాను రబాడ, లుంగి ఎంగిడి దెబ్బకొట్టారు. టీమ్ ఇండియా వికెట్లు పేకమేడను తలపించాయి.
రాహుల్ (123), రహానే(48) రాణించారు. ఆ తర్వాత వచ్చిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4) విఫలమయ్యారు. మూడో రోజు భారత్.. 55 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఎంగిడి 6 వికెట్లు తీయగా.. రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చూడండి: శార్దూల్‌పై అశ్విన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే?