అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma News).. విరాట్ కోహ్లీని భర్తీ చేయనున్నాడు. తద్వారా భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభమైంది. టీ20 ప్రపంచకప్ అనంతరం రవి శాస్త్రి స్థానంలో.. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News). రోహిత్-ద్రవిడ్ ద్వయం.. న్యూజిలాండ్ సిరీస్‌తో (New Zealand Tour of India) తమ కొత్త ప్రయాణాన్ని ఆరంభించనున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమ్ఇండియా.. మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరినా.. కప్పు కైవసం చేసుకోలేకపోయిన కివీస్‌కూ.. ఈ పర్యటన కీలకమే. అయితే.. పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో గెలవడం ఆ జట్టుకు సానుకూలాంశం. వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు (T20 World Cup 2022) ఇంకా ఏడాదే సమయం ఉన్నందున ఈ ఫార్మాట్లో పైచేయి సాధించాలని ఇరు జట్లూ బరిలోకి దిగనున్నాయి.
సమ ఉజ్జీల పోరు..
భారత్-కివీస్ (India vs New Zealand) ఇప్పటి వరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడితే.. అందులో 9 సార్లు బ్లాక్ క్యాప్స్‌దే విజయం. టీమ్ఇండియా 8 మ్యాచ్‌లు గెలవగా, ఒకటి రద్దయింది.
2009 నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు (Ind vs NZ Head to Head in T20) జరిగాయి. అవి..
- 2009లో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటన- కివీస్ విజయం
- 2012లో భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన- కివీస్ గెలుపు
- 2017లో భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన- భారత్ విజయం
- 2019లో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటన- కివీస్ విజయం
- 2020లో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటన- భారత్ గెలుపు
ఇవే కాకుండా, ఈ పర్యటనతోనే అంతర్జాతీయ టీ20ల్లో ఇరు దేశాల క్రికెటర్లు కొన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది. అవేంటంటే..
- ఇంకో మూడు సిక్సర్లు బాదితే.. అంతర్జాతీయ క్రికెట్లో 450 సిక్సర్లు కొట్టిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma T20 Record) నిలుస్తాడు.
- మరో 10 సిక్సర్లతో అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా ఘనత సాధిస్తాడు రోహిత్. అతడి కన్నా ముందు మార్టిన్ గప్తిల్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
- టీ20ల్లో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకోవడానికి ఇషాన్ కిషన్ ఇంకా ఒక్క క్యాచ్ పడితే చాలు
- 249 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ (KL Rahul News) నిలుస్తాడు. అతడి కన్నా ముందు రోహిత్, విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నారు.
- అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయికి 19 సిక్సర్ల దూరంలో ఉన్నాడు రిషభ్ పంత్
- టీ20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకునేందుకు వెంకటేశ్ అయ్యర్ మరో 5 సిక్సర్లు బాదితే చాలు.
- మరో నాలుగు వికెట్లు తీస్తే బుమ్రాను (66 వికెట్లు) అధిగమించి.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు యుజ్వేంద్ర చాహల్. ప్రస్తుతం 63 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి.
- టీ20ల్లో 250 వికెట్లు పూర్తి చేసుకునేందుకు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు చాహల్
- మరో 81 పరుగులు చేస్తే (Virat Kohli News) కోహ్లీ (3227 పరుగులు) రికార్డును అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు వీరుడిగా నిలుస్తాడు మార్టిన్ గప్తిల్.
ఆరోన్ ఫించ్- కేన్ విలియమ్సన్ - అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు (Kane Williamson News) కేన్ విలియమ్స్‌న్.. 126 పరుగులు చేస్తే చాలు. ఈ జాబితాలో 1724 పరుగులతో ఆరోన్ ఫించ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
- మరో 11 వికెట్లు తీస్తే.. షకిబ్ అల్ హసన్‌ను (117 వికెట్లు) అధిగమించి.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టిమ్ సౌథీ సొంతమవుతుంది.
ఇదీ చూడండి:IND vs NZ: రోహిత్‌కు ద్రవిడ్ బౌలింగ్.. కోచ్‌గా ప్రయాణం షురూ