తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మేం చేసింది నేరం కాదు.. ఇకపైనా ఇలాగే ఆడతాం'.. రనౌట్​ వివాదంపై హర్మన్ - భారత్​ మహిళల ఇంగ్లాండ్​ సిరీస్​

India vs England Women : ఇంగ్లాండ్​తో మూడు వన్డేల సిరీస్​ను భారత్​ 3-0 తేడాతో గెలిచింది. మూడో వన్డే చివర్లో భారత బౌలర్ దీప్తి.. నాన్​ స్ట్రైక్​లో ఉన్న ఇంగ్లాండ్​ ప్లేయర్​ చార్లీ డీన్​ను రనౌట్​ చేయడం వివాదస్పదంగా మారింది. దీనిపై హర్మన్​ ప్రీత్​ స్పందించింది.

harmanpreet kaur womens team india captain
harmanpreet kaur

By

Published : Sep 25, 2022, 1:59 PM IST

Updated : Sep 25, 2022, 2:27 PM IST

India vs England Women : ఇంగ్లాండ్​తో మూడు వన్డేల సరీస్​ను భారత్​ మహిళల జట్టు 3-0తో క్లీన్​ స్వీప్​ చేసింది. జులన్​ గోస్వామి ఆఖరి మ్యాచ్​లో ఘన విజయం సాధించి.. ఆమెకు ఘన వీడ్కోలు పలికింది. అయితే ఈ మ్యాచ్​ మరో వివాదానికి వేదికైంది. నాన్​స్ట్రైక్​లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్‌.. బంతి వేయకుండానే క్రీజు వదిలి ముందుకు వెళ్లడాన్ని గమనించిన భారత బౌలర్ దీప్తి.. ఆమెను రనౌట్‌ చేసింది. దీంతో ఈ విషయం మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. కీలక సమయంలో వికెట్ తీసి భారత్​ను గెలిపించిన దీప్తిపై భారత్​లో ప్రశంసలు కురుస్తుండగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం 'ఇది తొండి' అంటూ వాదనకు దిగారు.

మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ సైతం ఇబ్బందులు పడింది. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఛార్లీ డీన్‌ (47).. చివరి ఇద్దరు బ్యాటర్లతో కలిసి పోరాడి జట్టును విజయానికి చేరువ చేసింది. 17 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ గెలుస్తుందనగా డీన్‌ను దీప్తిశర్మ నాన్ స్ట్రైక్​లో రనౌట్‌ చేసి భారత్‌ను గెలిపించింది.

కాగా, ఈ విషయంపై మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్​కాన్ఫరెన్స్​లోనే హర్మన్ స్పందించింది. ఈ రనౌట్ చేసిన దీప్తికి అండగా ఉంటామని చెప్పింది. "ఈ రోజు మేము చేసింది తప్పుకాదు. అది ఆటలో భాగమే. ఐసీసీ రూల్స్​ ప్రకారమే మేము ఆడాం. అయినా మా ప్లేయర్​కు సపోర్టుగా నిలవడం మాకు అవసరం. రూల్స్ గుర్తుంచుకొని ఈ రనౌట్ చేసిన దీప్తిని చూస్తే సంతోషంగా ఉంది. ఆమె తప్పు చేసింది అని అనుకోను" అని పేర్కొంది. "మేము చేసిన పరుగులు తక్కువే. ఛేజ్ చేయగలిగేవే. కానీ మా బౌలర్లు బాగా ఆడారు. టీమ్​ అంతా కలిసికట్టుగా శ్రమించాము. అయితే లాస్ట్​ వికెట్​ గురించి కాకుండా ఈ మ్యాచ్​ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది" అని చెప్పింది హర్మన్​ ప్రీత్​.

పదేపదే అదే ప్రశ్న..
అయితే, అవార్డ్​ ప్రెజెంట్​ చేసేటప్పుడు అంత చారిత్రాత్మక విజయం, టీమ్ ఇండియా అద్భుతమైన విజయం గురించి కాకుండా.. హర్మన్​ను పదే పదే రన్​ ఔట్​ గురించే అడిగాడు ప్రెజెంటర్. అలా అడగడం హర్మన్​కు చిరాకు తెప్పించింది. దానిపై స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే మీరు ఆ ఒక్క వికెట్​ గురించి కాకుండా మిగతా 9 వికెట్ల గురించి అడగాలి. ఎందుకంటే ఆ 9 వికెట్లు తీయడం కూడా తక్కువ విషయం ఏం కాదు. అయినా మ్యాచ్​లో కొత్తగా మేము ఏం చేయలేదు. ఆ టైమ్​లో అలా ఔట్​ చేయాలనే అవగాహన ఉండటం మంచింది" అని సమాధానమిచ్చింది.

"నేను మా ప్లేయర్లకు సపోర్ట్​ చేస్తా. ఎందుకంటే వారు రూల్స్​కు అతీతంగా ఏమీ చేయలేదు. మ్యాచ్​కు ముందు మేము బాగా ఆడాలని చర్చించుకున్నాం. అలా ఆడగల సత్తా మాకు ఉంది. ఇలాంటి ఆటను ఇంకా మున్ముందు కూడా ఆడతాం" అని కౌంటర్​ ఇచ్చింది హర్మన్. ఇంతకుముందు జరిగిన ఓ టీ20 మ్యాచ్​లో భారత్​ జట్టుకు కూడా అలాంటి ఘటనే జరిగిందని హర్మన్​ చెప్పింది.

'లేదంటే గెలిచేవాళ్లం'
డీన్ రనౌట్ తనను అసంతృప్తికి గురిచేసిందని ఇంగ్లాండ్​ సీనియర్​ ప్లేయర్ కేట్ క్రాస్​ చెప్పుకొచ్చింది. "మ్యాచ్​లో ఒక వికెట్​ పడిపోయినా డిసప్పాయింట్​ అవుతాం. దీప్తి అలా నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము మ్యాచ్​ ఓడిపోయాం. డ్రెస్సింగ్​ రూంలోకి వెళ్లిన తర్వాత ఆ ఒక్క వికెట్​ ఉంటే మేము మ్యాచ్​ గెలిచేవాళ్లం అనుకుంటాం" అని క్రాస్​ అభిప్రాయపడింది.

దీప్తి చేసిన రనౌట్ పూర్తిగా లీగల్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ అభిమానులు ఇది అనైతికం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలే మన్కడింగ్​ను 'అన్​ఫేయిర్​ ప్లే' నుంచి రనౌట్​కు మార్చింది ఐసీసీ. దీంతో డీన్​ రనౌట్ న్యాయబద్ధంగానే జరిగిందని భారత అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రూల్ ప్రకారం రనౌట్ చేసినా.. అనైతికం అని అనడం సరికాదని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :టీమ్​ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్​లో గట్టెక్కేనా..?

జులన్​కు ఘనంగా వీడ్కోలు.. ఇంగ్లాండ్​ సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసిన భారత్​

Last Updated : Sep 25, 2022, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details