టీమ్ఇండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. సారధి రోహిత్ శర్మ చివరి బంతి వరకూ పోరాడినా భారత్‌ను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా... నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు సాధించింది.
శ్రేయస్, రోహిత్ శ్రమ వృథా.. రెండో వన్డే బంగ్లాదే.. సిరీస్ కూడా..
టీమ్ఇండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. సారధి రోహిత్ శర్మ చివరి బంతి వరకూ పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
19 ఓవర్లకే 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. వంద పరుగులు దాటడం కూడా కష్టమనిపించింది. కానీ మెహిదీ హసన్ అద్భుత శతకం.. మహమదుల్లా అర్ధ శతకంతో బంగ్లాకు పోరాడే స్కోరును సాధించిపెట్టారు. ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించిన వీరిద్దరూ.. భారత్‌పై ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో భారత్‌ను పోరులో నిలిపారు. కానీ పుంజుకున్న బంగ్లా బౌలర్లు
56 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ను, 82 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌ను వెంటవెంటనే అవుట్ చేశారు. గాయం కారణంగా డగౌట్‌కే పరిమితమైన రోహిత్ శర్మ ఏడో వికెట్ పడ్డ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్.. ఓ సిక్స్ కొట్టి ఉత్కంఠ పెంచాడు. చివరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా.. ముస్తాఫిజుర్ యార్కర్ వేయడంతో పరుగులేమీ రాలేదు. ఈ ఓటమితో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.