తెలంగాణ

telangana

వరల్డ్​ కప్ ఫైనల్​ సమరం- టీమ్ఇండియాను కలవరపెడుతున్న సమస్యలివే!

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 7:01 PM IST

India Vs Australia World Cup Final : అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్​ ఆస్ట్రేలియా మధ్య తుది పోరు జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియాను ఈ సమస్యలు కలవరపెడుతున్నాయి.

India Vs Australia World Cup Final
India Vs Australia World Cup Final

India Vs Australia World Cup 2023 Final :భారత్​ - ఆస్ట్రేలియా మధ్య తుది పోరు కోసం రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్​ కోసం అటు క్రికెట్ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వరుస విజయాలతో అజేయంగా నిలిచిన రోహిత్​ సేన.. ఈసారి ఎలాగైన వరల్డ్​ కప్​ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆసిస్​ కూడా తగ్గేదేలే అంటూ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలు టీమ్​ఇండియాను కలవరపెడుతున్నాయి.

మిస్సైన సిరాజ్ మెరుపులు​..!
బౌలింగ్​లో ఇంతకుముందు మెరిసిన మహ్మద్​ సిరాజ్​.. ఈ టోర్నీలో అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. ఈ వరల్డ్​ కప్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లోఏడు ఓవర్లలో 16 రన్స్​ మాత్రమే సమర్పించుకుని మూడు వికెట్లను పడగొట్టిన ఈ స్టార్ ప్లేయర్​.. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో మాత్రం 9 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చాడు. దీంతో రానున్న మ్యాచ్​లోనైనా ఈ స్టార్ ప్లేయర్​ తిరిగి ఫామ్​లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కఠిన పరిస్థితి ఎదుర్కోని లోయర్ ఆర్డర్!
టాప్ ఆర్డర్​ ప్లేయర్లు పటిష్టంగా ఉండటం వల్ల లోయర్ ఆర్డర్​లో ఉన్నవారెవరూ ఇప్పటివరకు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోలేదు. అయితే వరల్డ్​కప్​లో ఏదైనా జరగచ్చు. అటువంటప్పుడు జట్టులోని అందరూ కూడా మంచి ఫామ్​లో ఉండాల్సిందే. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు మ్యాచ్​లో ఆడేందుకు అంతగా అవకాశాలు దక్కక పోవడం వల్ల వారు కీలక ఇన్నింగ్స్​లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీలు అంటున్నారు.

బౌలర్లు బ్యాట్ ఝుళిపించాలి!
హార్దిక్ జట్టులోకి లేకపోవడం కూడా టీమ్ఇండియాకు పెద్ద లోటు. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆరుగురు బ్యాటర్లతో రంగంలోకి దిగిన రోహిత్​ సేన.. ఆడిన మ్యాచుల్లో మంచి ఫామ్​లోనే ఉంది. అయితే బుమ్రా, షమీ వంటి బౌలర్లు కొంత మేర బ్యాటింగ్ ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ.. క్రీజులో వారు సహాయక పాత్ర పోషించడమే తప్ప బ్యాటు ఝుళిపించలేదు. అయితే ఆసిస్​ జట్టు మాత్రం టీమ్ఇండియాకు భిన్నంగా రాణిస్తోంది.

వరల్డ్​ కప్​ మహాసంగ్రామం- వ్యూహాలకు టీమ్​ఇండియా పదును- 'బిలియన్ డ్రీమ్స్' సాకారమయ్యేనా?

'టీమ్ఇండియా అన్ని విభాగాల్లో బాగుంది- షమీ మాకు పెద్ద సవాల్!' : ప్యాట్ కమిన్స్

ABOUT THE AUTHOR

...view details