ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. దీంతో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. జట్టులో తొలిసారి చోటు సంపాదించుకున్న బౌలర్ టి. నటరాజన్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనపడ్డాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. 'కలనిజమైన వేళ' అని రాసుకొచ్చింది.
"ఐపీఎల్లో విజయవంతంగా బౌలింగ్ చేసిన నటరాజన్‌ను మనం చూశాం. టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్న నటరాజన్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కల నిజమైన వేళ ఇది."
--బీసీసీఐ