తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబై, దిల్లీ జట్లకు తొలి మ్యాచ్ సెంటిమెంట్ - ఐపీఎల్

ఐపీఎల్ 2019 సీజన్​లో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన తొలిమ్యాచ్​లో దిల్లీ గెలిచింది. 2013 నుంచి ఇప్పటి వరకు తొలి మ్యాచ్​లో ముంబయి వరుసగా ఓడిపోగా, క్యాపిటల్స్ మొదటిసారి గెలుపొందడం విశేషం.

ముంబై-దిల్లీ

By

Published : Mar 25, 2019, 4:29 PM IST

ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో దిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రెండు జట్లు అరుదైన ఘనత సాధించాయి. 2013 ఐపీఎల్​ నుంచి ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్​లో ఒక్కసారి కూడా గెలవలేదు. మరోవైపు దిల్లీ 2013 తర్వాత తొలిసారిగా మొదటి మ్యాచ్​ గెలిచింది.

ముంబై-దిల్లీ

రోహిత్ సేన​ తొలిమ్యాచ్​లో ఓడిపోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని టైటిల్ కొట్టిన చరిత్ర ఉంది. 2015 ఐపీఎల్​ సీజన్​లో వరుసగా 6 మ్యాచ్​ల్లో పరాజయం చెందినా.. చివరికి ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. 2017లోనూ ఓటములు చవిచూసినప్పటికీ టైటిల్​ని ఎగరేసుకుపోయింది.

దిల్లీ క్యాపిటల్స్ జట్టు 2013 నుంచి ఇప్పటివరకు తన తొలి మ్యాచ్​లో గెలవడం ఇదే మొదటి సారి. పాంటింగ్​, గంగూలీ లాంటి ఉద్ధండులు క్యాపిటల్స్ జట్టుకు జత కలిసినందున ఈ సారి ఆత్మ విశ్వాసంతో బరిలో దిగింది. మొదటి మ్యాచ్​లో ముంబయిపై గెలిచి సత్తా చాటింది.

ABOUT THE AUTHOR

...view details