తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​ - test match

బాక్సింగ్​ డే టెస్టులో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్​ కోసం టీమ్​ఇండియా నాలుగు మార్పులు చేసింది. గిల్​, సిరాజ్​ టెస్టు అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్​ తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

Australia vs India, 2nd Test  in Melbourne Cricket Ground, Melbourne
రెండో టెస్టు: టాస్​ గెలిచిన ఆసీస్​- భారత్​ బౌలింగ్​

By

Published : Dec 26, 2020, 4:37 AM IST

Updated : Dec 26, 2020, 4:56 AM IST

బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ రెండో మ్యాచ్​లో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఉదయం 5 గంటలకు మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో మ్యాచ్​ ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్​లో గెలిచిన ఆసీస్​ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. జట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు.

మరోవైపు టీమ్​ఇండియా సారథి విరాట్​ గైర్హాజరీలో రహానె జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది. భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. శుభ్​మన్​ గిల్​, మహ్మద్​ సిరాజ్​ టెస్టు అరంగేట్రం చేయనున్నారు. వికెట్​ కీపర్​ సాహా స్థానంలో రిషబ్​ పంత్​, గాయపడ్డ షమి స్థానంలో జడేజా జట్టులోకి వచ్చారు.

100వ టెస్టు..

ఈ మ్యాచ్​ భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 100వ టెస్టు కావడం కావడం విశేషం. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఆసీస్​ 43 గెలవగా, భారత్​ 28 నెగ్గింది. ఒక మ్యాచ్​ టై అయింది. మరో 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.

జట్లు..

భారత్​:మయాంక్​ అగర్వాల్​, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, అజింక్యా రహానె(కెప్టెన్​), హనుమ విహారి, రిషబ్​ పంత్​(వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​, ఉమేశ్​ యాదవ్​, జస్పీత్​ బుమ్రా, మహ్మద్​ సిరాజ్.​

ఆస్ట్రేలియా:మాథ్యూ వేడ్​, జో బర్న్స్​, మార్నస్​ లబూషేన్​, స్టీవెన్​ స్మిత్​, ట్రెవిస్​ హెడ్​, కామెరూన్​ గ్రీన్​, టిమ్​ పైన్​(కెప్టెన్​& వికెట్​ కీపర్​), పాట్​ కమ్మిన్స్​, మిచెల్​ స్టార్క్​, నాథన్​ లైయన్​, జోష్​ హేజిల్​వుడ్​.

Last Updated : Dec 26, 2020, 4:56 AM IST

ABOUT THE AUTHOR

...view details