తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రిస్బేన్ టెస్టు: తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5 - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020

బ్రిస్బేన్​ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్​ జట్టు 274 పరుగులు చేసింది. మరోవైపు భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్​, సుందర్​, శార్దూల్​ తలా ఓ వికెట్​ పడగొట్టారు.

Ind vs Aus test match 4 Day 1: Australia finish at 274/5
బ్రిస్బేన్ టెస్టు: తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5

By

Published : Jan 15, 2021, 1:10 PM IST

Updated : Jan 15, 2021, 2:04 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌(108*; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా, మాథ్యూవేడ్‌(45; 87 బంతుల్లో 6x4) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలిరోజు ఆటలో ఆసీస్‌దే పై చేయిగా నిలిచింది.

భారత బౌలర్లలో నటరాజన్‌ 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి కామెరాన్‌ గ్రీన్‌(28*), కెప్టెన్‌ టిమ్‌పైన్‌(38*) క్రీజులో ఉన్నారు.

Last Updated : Jan 15, 2021, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details