తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్​ బౌలింగ్​ - టీమిండియా

సిడ్నీ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది.

sedny test
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

By

Published : Jan 7, 2021, 4:43 AM IST

బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ మూడో మ్యాచ్​లో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఉదయం 5 గంటలకు సిడ్నీ వేదికగా మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఆత్మవిశ్వాసంతో టీమ్​ఇండియా బరిలో దిగుతుండగా.. గెలిచి తీరాల్సిందేనన్న కసితో ఆసీస్​ ఆటగాళ్లు ఉన్నారు.

వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ చేరికతో బలోపేతమైన భారత జట్టు ఈ మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​లో ముందంజ వేయాలని భావిస్తోంది. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న నవదీప్‌ సైనీ, 11 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

వార్నర్‌, పుకోవ్‌ స్కీ చేరికతో బలోపేతమైన కంగారు జట్టు మూడో టెస్టులో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది.

జట్లు..

భారత్​: రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్​మన్ గిల్, పుజారా, హనుమ విహారి, పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

ఆస్ట్రేలియా: డెవిడ్​ వార్నర్​, విల్​ పుకోవిస్కి, మార్నస్​ లబూషేన్, స్టీవెన్​ స్మిత్​, మాథ్యూ వేడ్​, కామెరూన్​ గ్రీన్​, టిమ్​ పైన్​(కెప్టెన్​& వికెట్​ కీపర్​), పాట్​ కమ్మిన్స్​, మిచెల్​ స్టార్క్​, నాథన్​ లైయన్​, జోష్​ హేజిల్​వుడ్​.

ఇదీ చూడండి:'ఆసీస్​ పేలవ బ్యాటింగ్​ భారత్​కు బలమవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details