భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలోనూ భారత్‌పై 51 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్(104) విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే - రెండో వన్డేలో భారత్‌పై ఆసీస్ విజయం
సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీసేన ఓడిపోయింది. తమ శక్తిమేర పోరాడినప్పటికీ లక్ష్యం పెద్దదిగా ఉండటం వల్ల భారత బ్యాట్స్‌మెన్ ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను ఆసీస్ గెల్చుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(80), ఫించ్(63) అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. అనంతరం వచ్చిన స్మిత్(104) సెంచరీతో చెలరేగాడు. లబుషేన్(70), మ్యాక్స్‌వెల్(63) తమ వంతు సహాయం చేశారు. భారత బౌలర్లలో షమి, హార్దిక్, బుమ్రా తలో వికెట్ తీశారు.
ఛేదనను కోహ్లీసేన ధాటిగానే ప్రారంభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(28), శిఖర్ ధావన్(30) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76), హార్దిక్ పాండ్య(28), జడేజా(24) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (3), హేజిల్‌వుడ్ (2), జంపా(2), హెన్రిక్స్, గ్లెన్ మ్యాక్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.