India Team for T20 World Cup : ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. పేసర్ బుమ్రా, ఆఖరి ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ఆవేష్ ఖాన్‌కు జట్టులో చోటు లభించలేదు. బౌలర్ మొహమ్మద్ షమీ తిరిగి టీమ్‌లో అడుగుపెట్టాడు. శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్‌ను రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును కూడా ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో ఆడబోయే టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా.
దక్షిణాఫ్రికాతో ఆడబోయే టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఇవీ చదవండి:అయ్యో పాపం.. ఈ ప్లేయర్ అన్నీ గోల్డెన్ డకౌట్లే
ఆ ప్లేయర్‌తో భారత మహిళా క్రికెటర్ ఎంగేజ్మెంట్.. త్వరలోనే పెళ్లి