తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2023, 4:52 PM IST

ETV Bharat / sports

టీమ్​ఇండియా హిస్టరీ రిపీట్​ చేసిందిగా.. ఇగ అందులోనూ అగ్రస్థానమే..

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్‌ మీదున్న టీమ్ఇండియా తాజాగా మరో ఘనత సాధించింది. అదేంటంటే..

Border gavaskar trophy Teamindia no 1 in all Formats
Border gavaskar trophy Teamindia no 1 in all Formats

క్రికెట్​ను భారతీయులు ఎంతగా ఆదరిస్తారో తెలిసిన విషయమే. భారత క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా భావిస్తారు. టీమ్​ఇండియా గెలుపు తమ గెలుపుగా భావిస్తారు. ఇంతటి అభిమానులు ఉన్న మన భారత జట్టు కూడా ప్రస్తుతం క్రికెట్‌లో అందరి అంచనాలకు తగ్గట్టుగానే బాగా రాణిస్తోంది. అభిమానుల అంచనాను వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా క్రికెట్‌ చరిత్రలో మరో రికార్డు హిస్టరీని రిపీట్‌ చేసింది.

అదేంటంటే.. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్‌ మీదున్న టీమ్ఇండియా తాజాగా మరో ఘనత సాధించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో భారత్​.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం రోహిత్‌ సేన 115 రేటింగ్‌ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. అలా టెస్టుల్లో టీమ్‌ఇండియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ జట్టుగా నిలిచింది. కాగా, గతంలో ఝార్ఘండ్​డైనమైట్‌గా క్రికెట్‌ అభిమానులు పిలుచుకునే ధోనీ నాయకత్వంలో భారత జట్టు ఇలాగే మూడు ఫార్మట్లలో మొదటి స్థానంలో నిలిచింది.

ఇకపోతే ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇక, భారత్, ఆసీస్‌ మధ్య ఫిబ్రవరి 17 నుంచి దిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మొదటి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ ప్రణాళికలు రచిస్తుండగా.. స్పిన్‌తో మరోసారి కంగారు పెట్టించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.

ఇదీ చూడండి:'ఆ సమయంలో​ తీవ్ర అసంతృప్తితో సచిన్​.. కానీ నేను మాత్రం సక్సెస్​ అయ్యా'

ABOUT THE AUTHOR

...view details